Godavari Boat Accident : గోదావరిలో బోటు మునిగింది అందుకేనా?
గోదావరిలో మునిగిపోయిన బోటు ప్రమాదానికి పలు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. పాపికొండల యాత్ర అంటే గోదావరి ప్రవాహానికి ఎదురు వెళ్లడమే. అయితే ఇది అక్కడి ప్రజలకు సర్వసాధారణం. కానీ టూరిస్టు బోట్లలో పర్యాటకులను తీసుకువెళ్లే లాంచీలు ఈ రూట్లో అన్నీఅనేకం తిరుగుతూ ఉంటాయి. వీటిలో ప్రైవేటు బోట్లతో పాటు ప్రభుత్వానికి చెందిన పర్యాటక శాఖ బోట్లు కూడా ఉంటాయి. ప్రధానంగా ఆదివారం జరిగిన బోటు […]
గోదావరిలో మునిగిపోయిన బోటు ప్రమాదానికి పలు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. పాపికొండల యాత్ర అంటే గోదావరి ప్రవాహానికి ఎదురు వెళ్లడమే. అయితే ఇది అక్కడి ప్రజలకు సర్వసాధారణం. కానీ టూరిస్టు బోట్లలో పర్యాటకులను తీసుకువెళ్లే లాంచీలు ఈ రూట్లో అన్నీఅనేకం తిరుగుతూ ఉంటాయి. వీటిలో ప్రైవేటు బోట్లతో పాటు ప్రభుత్వానికి చెందిన పర్యాటక శాఖ బోట్లు కూడా ఉంటాయి. ప్రధానంగా ఆదివారం జరిగిన బోటు ప్రమాదానికి గల కారణాలు విశ్లేషిస్తున్నారు.
ఆదివారం ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ బోటును స్థానికేతరులైన నూకరాజు, తామరాజు అనే డ్రైవర్లు నడిపారు. వీరిద్దరూ ఈ మార్గానికి కొత్తవారేనని తెలుస్తోంది. వీరికి నదిలో ఎక్కడ సుడులు, లోతు ఉంటాయో వంటి అంశాలపై సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణం.
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, అంటే ఎగువనుంచి కిందికి 4 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నసమయంలో బోటును తీసుకెళ్లడం కూడా ఈ ప్రమాదానికి కారణం. రాయల్ వశిష్ఠ బోటులో ఒకే ఇంజిన్ ఉంది. నిబంధనల ప్రకారం 20 మంది కంటే అధికంగా ప్రయాణికులు ఉంటే ఆ బోటుకు రెండు ఇంజిన్లు ఉండితీరాలి. కానీ ఈ బోటును ఒకే ఒక్క ఇంజన్‌తో నడిపిస్తున్నారు. అయితే ఈ బోటులో రెండో ఇంజన్ ఉన్నప్పటికీ పాడైపోయిన దాన్ని అలంకార ప్రాయంగా ఉంచడం బోటు నిర్వాహకుల కాసుల కక్కుర్తికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇవన్నీఇలా ఉంచితే బోటు మునిగిపోయే సమయంలో ప్రాణాలను దక్కించుకోడానికి అందులో ఉన్న జనం భయంతో ఒక వైపు పరుగులు పెట్టడం కూడా ఈ ఘోర దుర్ఘటనకు మరో కారణం. ప్రయాణికులంతా ఒకవైపునకు రావడంతో బోటు మరోవైపునకు ఒరిగిపోయింది.
గోదావరిలో పదుల సంఖ్యలో మృత్యుఒడికి చేరుకోడానికి కారణమైన రాయల్ వశిష్ఠ వంటి బోట్లు ఇంకా అనేకం ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పడు పరిశీలించాల్సిన అధికారులు వీటిని నిబంధనల ప్రకారం తనిఖీలు చేయకపోవడం కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం. ఈ దారుణ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.