విశాఖ‌లో అర్ధ‌రాత్రి మ‌రోసారి పొగ‌లు..! ప‌రుగులు తీసిన జ‌నం

విశాఖ‌లో అర్ధ‌రాత్రి మ‌రోసారి పొగ‌లు..! ప‌రుగులు తీసిన జ‌నం

విశాఖ న‌గ‌రంలో జ‌రిగిన గ్యాస్ లీకేజీ ప్ర‌మాదం ఇంకా సెగ‌లు గ‌గ్గుతోంది. ఎల్జీపాలిమ‌ర్స్ ప‌రిశ్ర‌మ నుంచి మ‌రోసారి గ్యాస్ లీకైన‌ట్లు వార్త‌లొచ్చాయి. దీంతో ప్ర‌జ‌లు ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు తీశారు. బైకులు, కార్లు, ఆటోలు ప‌లు వాహ‌నాల్లో స్థానికులంతా దూర ప్రాంతాలకు తరలి వెళ్లారు. సుమారు 4 కిలోమీటర్ల మేర విష వాయువు ఘాటు వాసనలు అలుముకున్నాయని కొంత మంది బాధితులు తెలిపారు. గురువారం  రాత్రి 10.30 గంటల సమయం నుంచి జనం ఇళ్లలోంచి పరుగు అందుకున్నారు. వేలాది […]

Jyothi Gadda

|

May 08, 2020 | 7:15 AM

విశాఖ న‌గ‌రంలో జ‌రిగిన గ్యాస్ లీకేజీ ప్ర‌మాదం ఇంకా సెగ‌లు గ‌గ్గుతోంది. ఎల్జీపాలిమ‌ర్స్ ప‌రిశ్ర‌మ నుంచి మ‌రోసారి గ్యాస్ లీకైన‌ట్లు వార్త‌లొచ్చాయి. దీంతో ప్ర‌జ‌లు ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు తీశారు. బైకులు, కార్లు, ఆటోలు ప‌లు వాహ‌నాల్లో స్థానికులంతా దూర ప్రాంతాలకు తరలి వెళ్లారు. సుమారు 4 కిలోమీటర్ల మేర విష వాయువు ఘాటు వాసనలు అలుముకున్నాయని కొంత మంది బాధితులు తెలిపారు.

గురువారం  రాత్రి 10.30 గంటల సమయం నుంచి జనం ఇళ్లలోంచి పరుగు అందుకున్నారు. వేలాది మంది స్థానికులు సింహాచలం కొండ సమీపానికి చేరుకున్న‌ట్లు స‌మాచారం. ఎల్జీ పాలిమర్స్ నుంచి పొగలు మరోసారి భారీగా వెలువడ్డాయి. గురువారం వేకువజామున 2.30 గంటల నుంచి గ్యాస్ లీకేజ్ కొనసాగుతూనే ఉందని.. చీకటి పడ్డ తర్వాత వాయువుల ఘాటు మరింత ఎక్కువైందని బాధితులు తెలిపారు.. రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ప్రభావం 24 గంటల పాటు ఉంటుందని నిపుణులు ఇప్పటికే చెప్పారు. అయితే.. ప్రమాద స్థలి నుంచి లీకేజీ పూర్తిగా ఆగిపోయిందనే విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. అక్కడ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఎంఏ బృందాలు పాల్పంచుకున్నాయి. గ్యాస్ లీకేజీని ఆపడానికి యాంటీడోస్ ప్రయోగిస్తున్నారు. అయితే.. ఈ చర్యలు ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించడంలేదు. దీంతో అహ్మదాబాద్ నుంచి డీబీఎస్ అనే ప్రత్యేక యంత్రాన్ని తెప్పిస్తున్నట్లు సమాచారం.

అయితే, అధికారులు మాత్రం ఎల్జీ పాలిమ‌ర్స్ పొగ‌ల‌పై పూర్తి జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లేవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌రోసా క‌ల్పించారు. ప్ర‌స్తుతం ప్ర‌భావ తీవ్ర‌త కేవ‌లం ఒక కిలోమీట‌ర్ వ‌ర‌కే ఉంటుంద‌ని, భారీగా పొగ‌లు వ‌స్తున్నాయ‌నే పుకార్లు న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ఘ‌ట‌న స్థ‌లంలో ఇంకా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu