విషాద దుర్ఘ‌ట‌న‌: ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

విషాద దుర్ఘ‌ట‌న‌: ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

విశాఖలో జ‌రిగిన గ్యాస్ లీక్ ఘ‌ట‌న ఎంద‌రికో క‌న్నీళ్ల‌ను మిగిల్చింది. ప‌చ్చ‌ని ప‌రిస‌రాల‌ను విష‌తుల్యంగా మార్చేసింది. ఈ దుర్ఘటనలో విషవాయువు పీల్చి

Jyothi Gadda

|

May 07, 2020 | 2:41 PM

విశాఖలో జ‌రిగిన గ్యాస్ లీక్ ఘ‌ట‌న ఎంద‌రికో క‌న్నీళ్ల‌ను మిగిల్చింది. ప‌చ్చ‌ని ప‌రిస‌రాల‌ను విష‌తుల్యంగా మార్చేసింది. ఈ దుర్ఘటనలో విషవాయువు పీల్చి ఎంబీబీఎస్ విద్యార్థి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయాడు. చంద్రమౌళి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో మెరిట్ ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటును దక్కించుకున్న టాలెంటెడ్ విద్యార్థి. భ‌విష్య‌త్తులో తమ కుమారుడు డాక్టరై ప్రజల ప్రాణాలు కాపాడతాడని తల్లిదండ్రులు ఆశిస్తే.. ఇంతలోనే విషవాయువు భావి డాక్టర్ ప్రాణాలు తీసుకుంది. చంద్రమౌళి తల్లిదండ్రులకు కొడుకు మరణం తీరని శోకం మిగిల్చింది.

ఇదిలా ఉంటే, గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. రసాయనక గ్యాస్‌  భారీగా లీక్ అవ్వడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మ‌ర‌ణించిన వారి వివ‌రాలుః కుందన శ్రేయ (6), ఎన్‌. గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్‌, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగ రాజు (48), మేకా కృష్ణమూర్తి (73)తోపాటు మరో ఇద్దరు మరణించారు.గ్యాస్ లీకేజి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం జ‌గ‌న్ పరామర్శించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలందిస్తామ‌ని భరోసా ఇచ్చారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu