బాబు ఇంటి ముంగిట “కృష్ణ”.. పొంచివున్న వాటర్ డేంజర్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముప్పు తప్పేలా కనిపించడం లేదు. కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ నుంచి భారీగా వరద నీరు కిందికి ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తివేసి వరద నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండిపోవడంతో అధికారులు 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పులిచింతల నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ జలకళను సంతరించుకుంది. అయితే నీటి […]

బాబు ఇంటి ముంగిట కృష్ణ.. పొంచివున్న వాటర్ డేంజర్
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2019 | 11:54 AM

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముప్పు తప్పేలా కనిపించడం లేదు. కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ నుంచి భారీగా వరద నీరు కిందికి ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తివేసి వరద నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండిపోవడంతో అధికారులు 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పులిచింతల నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ జలకళను సంతరించుకుంది. అయితే నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది. కరకట్ట సమీపంలో నిర్మించిన అనేక నిర్మాణాలు ఇప్పటికే వరదనీటితో మునిగిపోయాయి. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ మెట్ల వరకు వరద నీరు చేరుకుంది. పులిచింతలకు భారీ నీరు వస్తోందని.. అక్కడి నుంచి నీటిని విడుదల చేస్తే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని కరకట్ట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.