AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుమారుడితో గొడవ.. కోడెల ఆత్మహత్యకు కారణాలివేనా..!

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఆయనను.. వెంటనే బసవతారకం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటమి తరువాత కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు వినిపించాయి. కే టాక్స్ పేరుతో ఆయన కుటుంబం భారీగా వసూళ్లు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ […]

కుమారుడితో గొడవ.. కోడెల ఆత్మహత్యకు కారణాలివేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 16, 2019 | 1:12 PM

Share

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఆయనను.. వెంటనే బసవతారకం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో ఓటమి తరువాత కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు వినిపించాయి. కే టాక్స్ పేరుతో ఆయన కుటుంబం భారీగా వసూళ్లు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కోడెల, ఆయన కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామకృష్ణలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన సమయంలో ఫర్నీచర్‌ను సైతం తన నివాసానికి తరలించినట్లు ఆధారాలు లభించాయి. ఆ తరువాత ఫర్నీచర్‌ను అసెంబ్లీ సిబ్బంది స్వాధీనం చేసుకోగా.. అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇక వరుసగా వివాదాలు వస్తున్న సమయంలో.. ఆరోపణలపై కుమారుడితో మాట్లాడుతున్న సమయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు సన్నిహితులు చెబున్నారు. ఇలా ఓ వైపు కేసులు, మరోవైపు ఇంట్లో గొడవలు అవమానాలు తట్టుకోలేక పోయిన ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ