ప్రజావేదిక నేలమట్టం..!

ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు దాదాపు 50 శాతం పైగా పనులు పూర్తవగా.. సాయంత్రానికి పూర్తిగా నేలమట్టం అవుతుందని తెలుస్తోంది. కాగా నిన్న సాయంత్రమే సీఆర్డీఏ అధికారులు కరకట్టను తమ ఆధీనంలోకి తీసుకుని పనులు మొదలుపెట్టారు. ప్రజావేదికలోని సామాన్లను అధికారులు సీఆర్‌డీఏ ఆఫీస్‌లో భద్రపరిచినట్లు సమాచారం. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదికను నిర్మించినందున తక్షణమే కూల్చివేస్తామని కలెక్టర్లు సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. […]

ప్రజావేదిక నేలమట్టం..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 26, 2019 | 10:53 AM

ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు దాదాపు 50 శాతం పైగా పనులు పూర్తవగా.. సాయంత్రానికి పూర్తిగా నేలమట్టం అవుతుందని తెలుస్తోంది. కాగా నిన్న సాయంత్రమే సీఆర్డీఏ అధికారులు కరకట్టను తమ ఆధీనంలోకి తీసుకుని పనులు మొదలుపెట్టారు. ప్రజావేదికలోని సామాన్లను అధికారులు సీఆర్‌డీఏ ఆఫీస్‌లో భద్రపరిచినట్లు సమాచారం. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదికను నిర్మించినందున తక్షణమే కూల్చివేస్తామని కలెక్టర్లు సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో మంగళవారం సదస్సు ముగిసిన వెంటనే సీఆర్‌డీఏ అధికారులు రంగంలోకి దిగారు.

ఇకపోతే ఈ భవనం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ప్రక్కనే ఉండడం.. ఆయన విదేశీ టూర్‌ను ముగించుకుని గతరాత్రే ఇంటికి రావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనితో ఆ భవనం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాగా చంద్రబాబు ఇవాళ ఉదయం కార్యకర్తలతో భేటీ కానున్నట్లు సమాచారం.