ఈ నెలాఖరు కల్లా ఆ పోస్ట్‌లను భర్తీ చేస్తాం: వైఎస్ జగన్‌

బీసీ పరిధిలోని వివిధ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు.

ఈ నెలాఖరు కల్లా ఆ పోస్ట్‌లను భర్తీ చేస్తాం: వైఎస్ జగన్‌
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2020 | 3:00 PM

బీసీ పరిధిలోని వివిధ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాలపై కార్పొరేషన్లు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. అందరికీ పథకాలు అందించడమే ప్రధాన బాధ్యతగా నడుచుకోవాలని జగన్ సూచించారు.

తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల నగదు బదిలీ ద్వారా అందించామని ఆయన పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం గతంలో ఎవరూ ఇలా పని చేయలేదని.. లంచం, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. కొత్త వాటితో కలుపుకుని మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని.. గతంలో 69 కులాలకే ప్రాధాన్యత ఇవ్వగా, ఇప్పుడు మొత్తం బీసీ కులాలన్నింటికీ కార్పొరేషన్లలో ప్రాధాన్యత ఇస్తామని జగన్‌ తెలిపారు. ఇక ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు శంకర నారాయణ, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, మోపిదేవి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే