జగన్ కొత్త పథకం.. థ్యాంక్స్ చెప్పిన లాయర్లు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోన్న ఏపీ సీఎం జగన్.. మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. జూనియర్ న్యాయవాదుల కోసం ‘వైఎస్సార్ లా నేస్తం పథకం’ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్.. తాజాగా బటన్ నొక్కి లబ్ధిదారులైన న్యాయవాదుల అక్కౌంట్లలోకి నగదు జమచేశారు. ఈ పథకం ద్వారా జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా రూ.5వేల రూపాయలు అందనున్నాయి. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా జూనియర్ న్యాయవాదులకు నెలనెలా […]

ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోన్న ఏపీ సీఎం జగన్.. మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. జూనియర్ న్యాయవాదుల కోసం ‘వైఎస్సార్ లా నేస్తం పథకం’ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్.. తాజాగా బటన్ నొక్కి లబ్ధిదారులైన న్యాయవాదుల అక్కౌంట్లలోకి నగదు జమచేశారు. ఈ పథకం ద్వారా జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా రూ.5వేల రూపాయలు అందనున్నాయి.
అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా జూనియర్ న్యాయవాదులకు నెలనెలా రూ.5వేలు స్టైఫండ్ ఇవ్వడంపై న్యాయవాదులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు మంజూరు చేయడంపై కూడా వారు జగన్‌కు కృతఙ్ఞతలు చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల చట్టంలో సవరణలపై మార్పులు తీసుకువస్తున్నందుకు ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో ఏపీ బార్‌కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, వైస్ ఛైర్మన్ రామజోగేశ్వర్రావు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఎ.రామిరెడ్డి, సీనియర్ న్యాయవాది చిత్తరువు నాగేశ్వర్రావు, ఆర్.మాధవి, బార్‌కౌన్సిల్ సభ్యులు బివి. కృష్ణారెడ్డి, వి.బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.