రివర్స్ టెండరింగ్ బిగ్ హిట్..వాలంటీర్స్‌కు అదిరిపోయే ఫోన్లు

రివర్స్ టెండరింగ్ బిగ్ హిట్..వాలంటీర్స్‌కు అదిరిపోయే ఫోన్లు

ఏపీ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మొదట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే సీఎం చేసిన ప్రయోగం ఊహించని విధంగా సక్సెస్ అయ్యంది. పోలవరం పలు ప్రాజెక్టుల్లో ఈ పద్దతిని అవలంభించిన ఏపీ సర్కార్..భారీగా నిధులను కాపాడుకుంది. దీంతో అన్ని గవర్నమెంట్‌కు సంబంధించిన ఒప్పందాల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నాంది పలికింది.  తాజాగా స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలులో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి రూ. 83.8 కోట్లు […]

Ram Naramaneni

|

Dec 03, 2019 | 8:24 PM

ఏపీ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మొదట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే సీఎం చేసిన ప్రయోగం ఊహించని విధంగా సక్సెస్ అయ్యంది. పోలవరం పలు ప్రాజెక్టుల్లో ఈ పద్దతిని అవలంభించిన ఏపీ సర్కార్..భారీగా నిధులను కాపాడుకుంది. దీంతో అన్ని గవర్నమెంట్‌కు సంబంధించిన ఒప్పందాల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నాంది పలికింది.  తాజాగా స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలులో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి రూ. 83.8 కోట్లు ఆదా చేసింది ఏపీ సర్కార్. గ్రామ,వార్డు వాలంటీర్లకోసం 2,64,920 సెల్‌ఫోన్ల కోసం పలు కంపెనీలను టెండర్లకు ఆహ్వానించింది ప్రభుత్వం.

నవంబర్‌ 30న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రభుత్వం తరుపున తొలిదశ బిడ్డింగ్‌‌కు ఆహ్వానించగా..రూ. 317.61 కోట్లకు ఓ కంపెనీ కోట్‌ చేసింది. దీనిపై మళ్లీ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా ఈ సారి అదే కంపెనీ రూ.233.81 కోట్లకు కోట్‌ చేసి బిడ్‌‌ను దక్కించుకుంది. అంటే తొలిదశ బిడ్డింగ్‌ కన్నా రూ. 83.8 కోట్ల మేర తక్కువకు కోట్ చేసింది.  కాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్స్‌కు ఇచ్చే సెల్‌ఫోన్‌కు ఒక ఏడాది పాటు వారెంటీ, 3 జీబీ ర్యాం, 32 జీబీ మెమరీ, ఆక్టాకోర్‌ ప్రొసెసర్‌ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు మొబైల్‌ సాఫ్ట్‌వేర్‌ను కూడా అందించనున్నారు. మూడేళ్లపాటు మాస్టర్‌ డేటా మేనేజ్‌మెంట్, టైప్‌ ‘‘సి’’ లేదా మైక్రో యూఎస్‌బీ టూ మైక్రో యూఎస్‌బీ కన్వెర్టర్, టాంపర్డ్‌ గ్లాస్, బ్యాక్ కవర్, మూడు సంవత్సరాల వరకు మెయింటినెన్స్‌తో వాకిన్‌ సపోర్ట్‌ అందించనుంది బిడ్ దక్కించుకున్న కంపెనీ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu