ఉల్లితో డోంట్ వర్రీ….ఏపీ సర్కార్ ‘ప్యాజ్’ న్యూస్… రూ.25 కే
కట్ చేసేటప్పుడు ఉల్లి కన్నీళ్లు పెట్టించడం సహజం. కానీ ఇప్పుడు కొనేటప్పుడు కూడా ఏడిపిస్తుంది. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా భగ్గుమంటున్నాయి. ఉల్లిని దొంగలించే రేంజ్ వరకు వెళ్లిందంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా రూ.60 నుంచి రూ.100 మధ్యలో ఉల్లి అమ్మకాలు సాగుతున్నాయి. రెస్టారెంట్స్‌లో ఉల్లిని సర్వ్ చేయడం మానేశారు. పానీపూరి లవర్స్ పరిస్థితి అయితే వర్ణణాతీతం. ‘భయ్యా తోడా ప్యాజ్ దాలో’ అని అడుగుదామంటే…వాటి సెల్లర్స్ కొట్టేలా ఉన్నారు. ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో […]

కట్ చేసేటప్పుడు ఉల్లి కన్నీళ్లు పెట్టించడం సహజం. కానీ ఇప్పుడు కొనేటప్పుడు కూడా ఏడిపిస్తుంది. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా భగ్గుమంటున్నాయి. ఉల్లిని దొంగలించే రేంజ్ వరకు వెళ్లిందంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా రూ.60 నుంచి రూ.100 మధ్యలో ఉల్లి అమ్మకాలు సాగుతున్నాయి. రెస్టారెంట్స్‌లో ఉల్లిని సర్వ్ చేయడం మానేశారు. పానీపూరి లవర్స్ పరిస్థితి అయితే వర్ణణాతీతం. ‘భయ్యా తోడా ప్యాజ్ దాలో’ అని అడుగుదామంటే…వాటి సెల్లర్స్ కొట్టేలా ఉన్నారు. ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇప్పుటికే కేంద్ర ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్ల ద్వారా రూ.25 కే ఉల్లి అమ్మకాలు జరిపేందుకు సిద్దమైంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన భారాన్ని ధరల స్థిరీకరణ నిధి ద్వారా ప్రభుత్వమే భరించనుంది. ఇక కృత్రిమ కొరత సృష్టించేవారిపై కూడా కొరడా ఝలిపించనుంది ఏపీ సర్కార్. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు సిద్దమైంది.