AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నారైల ప్రేమకు నా సెల్యూట్ : సీఎం జగన్

డల్లాస్‌: అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జగన్‌ ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. అన్నం పెడుతున్న రైతు ఆకలిబాధతో మరణించకూడదన్నది తన కలన్న జగన్… ఏ ప్రభుత్వ పథకమైనా లంచం, వివక్ష లేకుండా పేదవాడికి అందుబాటులోకి రావాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కాల్వల ద్వారా […]

ఎన్నారైల ప్రేమకు నా సెల్యూట్ : సీఎం జగన్
Ram Naramaneni
| Edited By: |

Updated on: Aug 18, 2019 | 5:27 PM

Share

డల్లాస్‌: అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జగన్‌ ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. అన్నం పెడుతున్న రైతు ఆకలిబాధతో మరణించకూడదన్నది తన కలన్న జగన్… ఏ ప్రభుత్వ పథకమైనా లంచం, వివక్ష లేకుండా పేదవాడికి అందుబాటులోకి రావాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కాల్వల ద్వారా నీరు అందించాలనుకుంటున్నామని… పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదన్నారు.

రెండున్నర నెలల పరిపాలనలోనే చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నమన్న సీఎం… అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి కార్యక్రమాలు చేపట్టామని… గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నారైల కోసం ప్రభుత్వ వెబ్ సైట్‌లో ఓ పోర్టల్ తెరుస్తామన్న జగన్..అది డైరక్ట్‌గా సీఎంఓతో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఎన్నారైల సహాయనిధికి, సేవలకు వారి పేర్లే పెడతామని తేల్చి చెప్పారు.

ఇంకా సీఎం మాట్లాడుతూ..‘ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మద్యం బెల్టు దుకాణాల మూసివేత చేపట్టాం. మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం రిజర్వేషన్‌ కల్పించాం. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశాం. అవినీతికి ఆస్కారం లేకుండా టెండర్ల విషయంలో న్యాయ సమీక్ష చేపట్టాలని నిర్ణయించాం. దేశంలో కనీవినీ ఎరుగని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానం తీసుకొస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తున్నాం. పాఠశాలలు, ఆసుపత్రుల ప్రస్తుత ఫొటోలు చూపిస్తున్నాం. తర్వాత నాడు, నేడు అంటూ అభివృద్ధి చేసిన పాఠశాలలు, ఆసుపత్రుల ఫొటోలు చూపిస్తాం.  గత ప్రభుత్వం అవకాశం ఉన్నా తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయలేదు. 13 నెలలుగా డిస్కమ్‌లకు బిల్లులు కూడా చెల్లించలేదు. దాదాపు రూ.20వేల కోట్లు డిస్కమ్‌లకు బకాయిలు పడింది. రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు ఉన్నాయి. పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలను చెరిపేసే చర్యలు చేపట్టాం’ అని తెలిపారు.