బెజవాడలో టీడీపీ నేతల ట్విట్టర్ వార్
బెజవాడలో ట్విట్టర్ వార్ మొదలైంది. టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం కేశినేని నాని..సొంతపార్టీలోని కొందరు నేతలను టార్గెట్ చేశారు. లోకేశ్, దేవినేని ఉమా లాంటి చంద్రబాబు కోటరీ నేతలపై తన అక్కసును వెళ్లగక్కారు. తాజగా ఆయన టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్నపై ఫైరయ్యారు. దీనిపై కొద్దిసేపటికే బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘సంక్షోభం సమయంలో పార్టీ కోసం…నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర […]
బెజవాడలో ట్విట్టర్ వార్ మొదలైంది. టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం కేశినేని నాని..సొంతపార్టీలోని కొందరు నేతలను టార్గెట్ చేశారు. లోకేశ్, దేవినేని ఉమా లాంటి చంద్రబాబు కోటరీ నేతలపై తన అక్కసును వెళ్లగక్కారు. తాజగా ఆయన టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్నపై ఫైరయ్యారు.
దీనిపై కొద్దిసేపటికే బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘సంక్షోభం సమయంలో పార్టీ కోసం…నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు..చనిపోయేవరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ ట్వీట్ చేశారు.
సంక్షోభం సమయంలో పార్టీ కొసం నాయకుడి కొసం పొరాడెవాడు కావాలి….ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చెవాడు ప్రమాదకరం….నీ లాగా అవకాసవాదులు కాదు…చనిపొయెవరకు చంద్రబాబు కొసం సైనికుడిలా పొరాడేవాడు కావాలి
— venkanna_budda (@BuddaVenkanna) July 14, 2019
అంతకు ముందు కేశినేని నాని… ‘నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడని కేశినేని నాని ట్వీట్ చేశారు. అంతేకాదు నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు… ఇది మన దౌర్భాగ్యం’ అంటూ ట్వీట్‌లో విమర్శించారు.
నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు నాలుగు వాక్యాలు రాయలేనివాడు Tweet చేస్తున్నాడు. దౌర్భాగ్యం!
— Kesineni Nani (@kesineni_nani) July 14, 2019