నాడు సీబీఐ వద్దన్నారు.. ఇప్పుడెందుకు మాట మార్చారు..?: బాబుపై బొత్స ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఫైర్ అయ్యారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు.. ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ చంద్రబాబు గవర్నర్‌ను కోరారని.. కాని, ఒకప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ రావద్దన్న చంద్రబాబు.. ఇప్పుడెందుకు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. కోడెల చనిపోయారన్న సానుభూతి లేకుండా.. ఆయన చావును అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధిపొందాలని […]

నాడు సీబీఐ వద్దన్నారు.. ఇప్పుడెందుకు మాట మార్చారు..?: బాబుపై బొత్స ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 19, 2019 | 6:03 PM

టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఫైర్ అయ్యారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు.. ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ చంద్రబాబు గవర్నర్‌ను కోరారని.. కాని, ఒకప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ రావద్దన్న చంద్రబాబు.. ఇప్పుడెందుకు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. కోడెల చనిపోయారన్న సానుభూతి లేకుండా.. ఆయన చావును అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని బొత్స ఆరోపించారు. పనికిమాలిన వ్యవస్థ అని వైసీపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతల బృందం ఎందుకు వెళ్లిందని ఆయన మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు, కోడెలను ఎన్నిసార్లు కలిశారు..? అసలు కోడెల బీజేపీలో ఎందుకు చేరాలనుకున్నారని ఇందుకు టీడీపీ నేతలే సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేశారని ఆయన దుయ్యబట్టారు. కోడెల కుటుంబం పై వైసీపీ ప్రభుత్వానికి సానుభూతి ఉందని బొత్స చెప్పుకొచ్చారు.