ఏపీఎస్‌ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్..
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. సిబ్బందిని తగ్గిస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అద్దె బస్సుల పెంపుదల ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేసింది. సిబ్బంది తగ్గింపు చర్యలను వెంటనే నిలిపివేయాలని జేఏసీ కన్వీనర్ ప్రభుత్వాన్ని కోరారు. ఫిబ్రవరి 5న మంత్రి అచ్చెన్నాయుడితో చర్చలు జరిపిన తరుణంలో వేతన సవరణ బకాయిల వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీటన్నీటి నేపథ్యంలో ఈ నెల 9న ఆర్టీసీ ఎండీ, కార్మిక శాఖ […]
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. సిబ్బందిని తగ్గిస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అద్దె బస్సుల పెంపుదల ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేసింది. సిబ్బంది తగ్గింపు చర్యలను వెంటనే నిలిపివేయాలని జేఏసీ కన్వీనర్ ప్రభుత్వాన్ని కోరారు. ఫిబ్రవరి 5న మంత్రి అచ్చెన్నాయుడితో చర్చలు జరిపిన తరుణంలో వేతన సవరణ బకాయిల వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీటన్నీటి నేపథ్యంలో ఈ నెల 9న ఆర్టీసీ ఎండీ, కార్మిక శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇవ్వాలని ఈయూ సహా 8 కార్మిక సంఘాలు నిర్ణయించాయి.