త్వరలోనే ఏపీలో మరో నోటిఫికేషన్.. ఈసారి ఎన్ని పోస్టులంటే..!

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టిని సారించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. త్వరలో నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందించనున్నారు. సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న కీలక శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం జనవరిలో పలు నోటిఫికేషన్లను జారీ చేయనుంది జగన్ సర్కార్. ఈ క్రమంలో అటవీ శాఖలో సిబ్బంది కొరతగా ఉందని.. అందులో ఖాళీగా ఉన్న పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. విశాఖ జిల్లా కాంబాలకొండలో […]

త్వరలోనే ఏపీలో మరో నోటిఫికేషన్.. ఈసారి ఎన్ని పోస్టులంటే..!
Follow us

| Edited By:

Updated on: Nov 11, 2019 | 12:45 PM

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టిని సారించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. త్వరలో నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందించనున్నారు. సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న కీలక శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం జనవరిలో పలు నోటిఫికేషన్లను జారీ చేయనుంది జగన్ సర్కార్. ఈ క్రమంలో అటవీ శాఖలో సిబ్బంది కొరతగా ఉందని.. అందులో ఖాళీగా ఉన్న పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

విశాఖ జిల్లా కాంబాలకొండలో జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. వీరప్పన్ చేతిలో మృతి చెందిన ఐఎఫ్ అధికారి శ్రీనివాస్‌తో పాటు పలువురు అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. అటవీ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2500 పోస్టులను ఈ జనవరిలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికడతామని.. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇక త్వరలోనే అటవీ అధికారులకు నూతన ఆయుధాలు, వాహనాలు అందచేయనున్నామని పేర్కొన్నారు. వాహనాల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసిందన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో 33 శాతం అడవులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. ఇక ఏపీ అటవీ శాఖ దగ్గరున్న 60టన్నుల ఎర్ర చందనం అమ్మడానికి కేంద్ర అనుమతిని కోరామని మంత్రి వివరించారు.