సచివాలయ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయంటే..!

ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను సెప్టెంబరు 19 లేదా 20 తేదీల్లో వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ పూర్తి కాగా.. మంగళవారం (సెప్టెంబరు 17) తుది పరిశీలన కూడా పూర్తైంది. అయితే ఏపీలో మొత్తం 1,26,728 సచివాలయ ఉద్యోగాల పోస్టులను భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ […]

సచివాలయ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 18, 2019 | 9:08 AM

ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను సెప్టెంబరు 19 లేదా 20 తేదీల్లో వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ పూర్తి కాగా.. మంగళవారం (సెప్టెంబరు 17) తుది పరిశీలన కూడా పూర్తైంది.

అయితే ఏపీలో మొత్తం 1,26,728 సచివాలయ ఉద్యోగాల పోస్టులను భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిల్లో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులు ఉన్నాయి. ఇక ఈ పరీక్షల కోసం మొత్తం 21,69,814 మంది అభ్యర్థులు ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 19.74 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2న విధుల్లో చేరతారు. నియామకాలు పొందినవారికి రూ.15 వేల స్టైఫండ్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత శాశ్వత పే స్కేలు వర్తింపజేయనున్నారు.