ఏపీలో వెల్లువెత్తనున్న కొలువుల జాతర..!
నిరుద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త ఇవ్వనుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీకి రేపు భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, పంచాయతీ స్థాయిలో పని చేసే ఈ ఉద్యోగాలకు నెలకు పదిహేను వేల కనీస వేతనం లభిస్తుంది. గ్రామస్థాయిలో ఇది చక్కని వేతనం అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉండగా.. టెన్త్, ఇంటర్ ఆపై చదువు కలిగిన వారు వీటికి అర్హులుగా పేర్కొన్నారు. ఇక […]
నిరుద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త ఇవ్వనుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీకి రేపు భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, పంచాయతీ స్థాయిలో పని చేసే ఈ ఉద్యోగాలకు నెలకు పదిహేను వేల కనీస వేతనం లభిస్తుంది. గ్రామస్థాయిలో ఇది చక్కని వేతనం అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉండగా.. టెన్త్, ఇంటర్ ఆపై చదువు కలిగిన వారు వీటికి అర్హులుగా పేర్కొన్నారు. ఇక ఈ పోస్టుల కోసం యువత ఇప్పటికే క్యూ కట్టారు.
ఇక దీనికి సంబంధించిన నియామకాలను కూడా అతి త్వరలోనే పూర్తి చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్ కల్లా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. అందుకు పోటీ పరీక్షను సెప్టెంబర్ ఒకటవ తేదీన నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం నూటా యాభై మార్కులకు ఉండే ఈ పరీక్షలో డెబ్బై ఐదు మార్కులకు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు – డెబ్బై ఐదు మార్కులకు సంబంధిత ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని సమాచారం.