అవి శ్వేతపత్రాలా.. బోగస్ పత్రాలా.. చంద్రబాబు పై విజయసాయి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తాళపత్రాలు విడుదల చేసినా, ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్వీట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు 10 బోగస్ పత్రాలు వదిలారని విమర్శించారు. అయినా ఘోర పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా పెంచిన అంచనాలను ఇప్పుడు బయటపెడతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. […]

అవి శ్వేతపత్రాలా.. బోగస్ పత్రాలా..  చంద్రబాబు పై విజయసాయి ఫైర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 24, 2019 | 1:05 PM

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తాళపత్రాలు విడుదల చేసినా, ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్వీట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు 10 బోగస్ పత్రాలు వదిలారని విమర్శించారు. అయినా ఘోర పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా పెంచిన అంచనాలను ఇప్పుడు బయటపెడతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యల కంటే తన కరకట్ట నివాసం, బినామీల ఆస్తులు, అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడం పై చంద్రబాబు ఆందోళన చెందుతున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. అసలు అమరావతిని ఎంపిక చేసిందే తన బినామీల స్థిరాస్తి వ్యాపారం కోసం. ఇప్పుడు పునాదులు కూడా లేవని అమరావతిని చంపేశారని శోకాలు పెడుతున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.