AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై ఆన్ లైన్‌లో చేనేత వస్త్రాలు.. జగన్ సంచలన నిర్ణయం!

మారుతున్న పరిస్థితులు బట్టి.. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈ అధునాతన ప్రపంచంలో అందరూ కూడా షాపింగ్ ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ఇప్పుడు భారీగా సేల్స్ జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. దీనితో చేనేత వస్త్రాలకు డిమాండ్ తగ్గుతోంది.. వాటిని తయారు చేసే కార్మికులకు, వ్యాపారులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఇకపై అలా జరగకుండా ఉండటానికి జగన్ ప్రభుత్వం ‘వైఎస్ఆర్ చేనేత నేస్తం’ పేరుతో ఏటా రూ. 24 వేల […]

ఇకపై ఆన్ లైన్‌లో చేనేత వస్త్రాలు.. జగన్ సంచలన నిర్ణయం!
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 29, 2019 | 6:56 PM

Share

మారుతున్న పరిస్థితులు బట్టి.. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈ అధునాతన ప్రపంచంలో అందరూ కూడా షాపింగ్ ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ఇప్పుడు భారీగా సేల్స్ జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. దీనితో చేనేత వస్త్రాలకు డిమాండ్ తగ్గుతోంది.. వాటిని తయారు చేసే కార్మికులకు, వ్యాపారులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఇకపై అలా జరగకుండా ఉండటానికి జగన్ ప్రభుత్వం ‘వైఎస్ఆర్ చేనేత నేస్తం’ పేరుతో ఏటా రూ. 24 వేల సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా అమెజాన్- ఫ్లిప్ కార్ట్ కంపెనీలతో ఆన్లైన్ ద్వారా చేనేత వస్త్రాల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచే అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఎన్నికల ముందు చేనేత రంగం అభివృద్ధికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ‘వైఎస్ఆర్ చేనేత నేస్తం’ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ. 24 వేలు సాయం చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఎప్పటి నుంచో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశవిదేశాలకు చేనేత ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు పటిష్టమైన మార్కెటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా.. తద్వారా చేనేత కార్మికులకు లబ్ది చేకూరేలా బాటలు వేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరాల నుంచి.. చొక్కాలు, పంచెల వరకు అన్ని రకాల నాణ్యమైన చేనేత వస్త్రాలన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేలా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేయనుంది. నవంబర్ 1 నుంచి ఈ సేల్స్ ప్రారంభం అవుతాయి. తొలిదశలో 25 ఉత్పత్తులను అమెజాన్ ద్వారా విక్రయించనుండగా.. నవంబర్ చివరి వారం నుంచి ఫ్లిప్ కార్ట్‌లోనూ చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయి.

అలాగే ధరల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పాలి. మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా రూ.500 నుంచి రూ.20,000 వరకు ధరలు ఉంటాయని తెలిపింది. కాగా, జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా త్వరలోనే చేనేత కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.