కోడెల ఆత్మహత్య..? ఎన్నో అనుమానాలు..!
ఏపీ మాజీ స్పీకర్ కోడెల సోమవారం మృతి చెందారు. ఈ విషయాన్ని బసవతారకం ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఉరి వేసుకుని.. ఆఖరి శ్వాసలో ఆయన ఉండగా.. కోడెలను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే బసవతారకం హాస్పిటల్‌కు తరలించారు. గత కొద్ది రోజుల క్రితమే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అయితే.. ఆయన గుండెపోటుతోనే కన్నుమూసినట్లు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల కోడెల తట్టుకోలేకపోయారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డారని కోడెల అనుచరులు చెబుతున్నారు. […]
ఏపీ మాజీ స్పీకర్ కోడెల సోమవారం మృతి చెందారు. ఈ విషయాన్ని బసవతారకం ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఉరి వేసుకుని.. ఆఖరి శ్వాసలో ఆయన ఉండగా.. కోడెలను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే బసవతారకం హాస్పిటల్‌కు తరలించారు. గత కొద్ది రోజుల క్రితమే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
అయితే.. ఆయన గుండెపోటుతోనే కన్నుమూసినట్లు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల కోడెల తట్టుకోలేకపోయారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డారని కోడెల అనుచరులు చెబుతున్నారు. మరోవైపు కొడుకుతో ఉన్న తగాదాల కారణంగానే.. ఆయన సూసైడ్ అటెమ్ట్ చేశారనే.. వాదనలు కూడా వినవచ్చాయి.
గత కొంతకాలం కిందటే.. సడన్‌గా హార్ట్‌ఎటాక్‌కి గురైన.. కోడెల.. అల్లుడి ఆసుత్రిలోనే చికిత్స చేయించుకున్నారు. అయినా.. కోడెల శివప్రసాద్ చనిపోయి ఇంత సమయం గుడుస్తున్నా.. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బసవతాకం వైద్యులు కూడా.. మరణ వార్తను ధృవీకరించారే తప్ప.. ఏ కారణం చేత చనిపోయారో తెలుపలేదు.
మరో ప్రశ్న ఏంటంటే.. ఆయన్ని చనిపోయిన తరువాతనే బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసం బంజారాహిల్స్‌లో ఉంటే.. దగ్గరలో ఎన్నో ఆస్పత్రులు ఉండగా.. క్యాన్సర్ హాస్పిటల్‌కే ఎందుకు తీసుకొచ్చారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా.. ఆయనకు ఆత్మహత్య చేసుకుని చనిపోయేటంత అవసరం ఏంటని.. పలు రకాల మాటలు వినిపిస్తున్నాయి.