YS Jagan: చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు.. అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు

Andhra Pradesh CM YS Jagan: తాను గాల్లోనే వచ్చి గాల్లోనే కలిసిపోతానంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ స్పందించారు.

YS Jagan: చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు.. అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు
AP CM YS Jagan

తాను గాల్లోనే వచ్చి గాల్లోనే కలిసిపోతానంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన జగన్.. తనను వ్యతిరేకించిన వైఎస్సార్ కూడా కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నాయకుడు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు గారి సంస్కారానికి నా నమస్కారాలు అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

తన పర్యటన కారణంగా అధికార యంత్రాంగం చేస్తోన్న సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడకూడదనే.. వరద బాధిత ప్రాంతాల్లో పరామర్శలకు వెళ్లలేదన్నారు. పరిస్థితి కుదుటపడిన తర్వాత తాను తప్పనిసరిగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. సాయం జరిగిందో? లేదో? అడిగి తెలుసుకుంటానన్నారు.

లీడర్ అనే వ్యక్తి ఎవరైనా డ్రామాలు చేయడం కాదని.. ప్రజలకు మంచి చేయాలి.. సాయం అందుతోందా? లేదా? చూడాలన్నారు.

Also Read..

TDP: టీడీపీలో చేరిన జమ్మలమడుగు నేతలు.. ఇకపై వలసపక్షులకు చోటు లేదన్న చంద్రబాబు

Pooja Hegde: రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలను నాటిన గోపికమ్మ.. మరో ముగ్గురు బాలీవుడ్ హీరోలకు ఛాలెంజ్

Click on your DTH Provider to Add TV9 Telugu