AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దిశ చట్టం’ అమలుపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

దిశ చ‌ట్టం అమ‌లుపై ఏపీ సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా ప‌లువురు అధికారులు హాజరయ్యారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియపై..

‘దిశ చట్టం' అమలుపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2020 | 5:36 PM

Share

దిశ చ‌ట్టం అమ‌లుపై ఏపీ సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా ప‌లువురు అధికారులు హాజరయ్యారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియపై సీఎం ఆరా తీశారు. కేంద్ర హోం శాఖ వద్ద ఫైలు పెండింగులో ఉంద‌ని జ‌వాబు ఇచ్చారు అధికారులు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్రిమినల్‌‌ లాలో సవరణలు చేస్తూ పంపిన బిల్లుకూ కేంద్రం ఆమోదం వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాల‌ని సూచించారు సీఎం.

ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకంపైనా సీఎం ఆరా తీశారు. దిశ చట్టం కింద కేసుల విచారణకు 13 జిల్లాలో 11 మంది ప్రాసిక్యూటర్లు, పోస్కో కేసుల విచారణకు 8 మంది ప్రాసిక్యూటర్లను ప్రత్యేకంగా నియమించామని వెల్ల‌డించారు అధికారులు. మిగిలిన చోట్ల కూడా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను త్వరగా నియమించాలన్నారు సీఎం.

దిశ చట్టం, యాప్, నంబర్లకు సంబంధించిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు, ప్రజలు ఎక్కువగా వచ్చి పోయే ప్రాంతాలు, వారు సమావేశమయ్యే చోట్ల పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే వీలైనంత త్వరగా ఫొరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే ప్రతి నెలా.. తీసుకోవాల్సిన చర్యల మీద సమీక్ష చేసుకోవాలి. దిశ యాప్‌ కింద వచ్చే ఫిర్యాదులకు క్వాలిటీ సేవలు అందాలని స్పష్టం చేశారు సీఎం.

Read More:

కోమాలో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణబ్ ముఖ‌ర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిట‌ల్‌

భార‌త క్రికెట‌ర్‌కి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌

అభిరామ్ యాక్సిడెంట్ చేయ‌లేదు.. క్లారిటీ ఇచ్చిన ద‌గ్గుబాటి ఫ్యామిలీ

ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌

బంగారం - వెండి కాదు.. ఇప్పుడు మార్కెట్‌లో దీనిదే హవా.. ఏడాదిలోనే
బంగారం - వెండి కాదు.. ఇప్పుడు మార్కెట్‌లో దీనిదే హవా.. ఏడాదిలోనే
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..