Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. మాస్టర్‌ ప్లాన్‌ మార్పుపై 4 గంటలకు పైగా సీఐడీ విచారణ

|

Nov 19, 2022 | 7:10 AM

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలపై నారాయణస్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు అధికారులు. మంగళగిరి MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి కంప్లైంట్‌తో అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అవకతవకలపై దర్యాప్తు జరుపుతోంది సీఐడీ. కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్చారన్నది ప్రధాన అభియోగం.

Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. మాస్టర్‌ ప్లాన్‌ మార్పుపై 4 గంటలకు పైగా సీఐడీ విచారణ
Narayana
Follow us on

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ ప్లాన్‌ ఛేంజ్‌ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఉచ్చు బిగుస్తోంది. నారాయణ బెయిల్‌ను ఆల్రెడీ సుప్రీంలో సవాల్‌ చేసిన ఏపీ సీఐడీ, 160 CRPC కింద నోటీసులిచ్చి ఇంటరాగేట్‌ చేసింది. హైకోర్టు ఆదేశాలతో నారాయణను ఆయన ఇంట్లోనే ప్రశ్నించింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలపై నారాయణస్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు అధికారులు. మంగళగిరి MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి కంప్లైంట్‌తో అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అవకతవకలపై దర్యాప్తు జరుపుతోంది సీఐడీ. కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్చారన్నది ప్రధాన అభియోగం. 2014-19 మధ్య ఈ అవకతవకలు జరిగినట్లు కంప్లైంట్‌ చేశారు ఎమ్మెల్యే ఆర్కే. అలైన్‌మెంట్‌ మార్చడంతో రామకృష్ణా హౌసింగ్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, LEPL ప్రాజెక్ట్స్‌, లింగమనేని అగ్రికల్చర్‌ ఫామ్స్‌, జయని ఎస్టేట్‌కు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. RK ఫిర్యాదుతో 120B, 420, 34, 36, 37, 166 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది సీఐడీ.

ఆనాడు మున్సిపల్‌ మినిస్టర్‌గా ఉండటంతో నారాయణపైనే మెయిన్‌ ఫోకస్‌ పెట్టారు అధికారులు. నారాయణే.. అలైన్‌మెంట్‌ మార్పులు చేసినట్లు గుర్తించి అభియోగాలు నమోదు చేసింది. అయితే, కేసు విచారణకు రావాలని సీఐడీ నోటీసులివ్వడంతో హైకోర్టును ఆశ్రయించారు నారాయణ. తనకు సర్జరీ జరిగిందని, సీఐడీ ఆఫీస్‌కి వెళ్లలేనని కోర్టుకు విన్నవించుకున్నారు. దాంతో, ఇంట్లోనే విచారించాలంటూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. న్యాయస్థానం ఆదేశాలతో, న్యాయవాది సమక్షంలో నారాయణ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసింది ఏపీ సీఐడీ.

మరోసారి విచారణ..
అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఛేంజ్‌తోపాటు భూసేకరణలో అవకతవకలపైనే ఇంటరాగేషన్‌ సాగింది. ఎవరి ఆదేశాలతో ప్లాన్ ఛేంజ్‌ చేశారు?. ఎవరెవరి లబ్ధి కోసం మార్పులు చేశారు?. అసలు, అలైన్‌మెంట్‌ మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది?. అలైన్‌మెంట్‌ మార్చమని చెప్పిందెవరంటూ ప్రశ్నించారు. మొత్తం 25మంది సీఐడీ అధికారులు అనేక కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపించారు. నాలుగు గంటలకు పైగా ఇంటరాగేషన్‌ సాగినా, మొత్తం డాక్యుమెంట్స్‌ ఎగ్జామినేషన్‌ కంప్లీట్‌ కాకపోవడం, టెక్నికల్‌ ఎవిడెన్స్‌ దొరకపోవడం, పూర్తిస్థాయిలో విచారణ జరగకపోవడంతో, మరోసారి నారాయణను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..