Andhra Pradesh: భారమైనా భరించాల్సిందే.. విద్యుత్ చార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

ఏపీ ప్రజల నెత్తిన విద్యుత్ చార్జీల పిడుగు తప్పదంటూ ఏపీ సర్కార్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.. విద్యుత్‌ చార్జీల పెంపు వైసీపీ పాపమేనని.. ఈసారికి తప్పదు. భారమైనా భరించాల్సిందే.. అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Andhra Pradesh: భారమైనా భరించాల్సిందే.. విద్యుత్ చార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
Electricity Charges
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2024 | 7:58 PM

విద్యుత్‌ చార్జీల పెంపు వైసీపీ పాపమే.. ఈసారికి తప్పదు. భారమైనా భరించాల్సిందే. వాళ్ల అప్పుల పాపాలు.. మనకు శిక్షలు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో విద్యుత్ ట్రూఅప్‌ చార్జీలపై పొలిటికల్ దుమారం మొదలైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ఛార్జీల భారమైతే తప్పదంటూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. గత ప్రభుత్వ పాపాలకు పర్యవసానం అని.. డిస్కమ్‌లకు ఇచ్చిన అనుమతిని రద్దుచెయ్యలేమన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపు వైసీపీ పాపమే అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం మాత్రం ఐదేళ్లు ఏ భారం మోపదని భరోసా ఇచ్చారు.

ట్రూఅప్ చార్జీలంటే ఏంటి..?

అయితే.. ట్రూఅప్ చార్జీల రూపంలో ఏపీ ప్రజలు జనవరి నుంచి 15 నెలలపాటు అదనపు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అసలు ట్రూ అప్‌ అంటే ఏంటంటే.. ఈఆర్‌సీ ఆమోదించిన రెవెన్యూ వ్యయం కన్నా అధికంగా చేసిన ఖర్చులను డిస్కమ్‌లు ట్రూ అప్‌ చార్జీల పేరుతో వినియోగ దారులు నుంచి వసూలు చేసుకుంటాయి.

ఇంతకీ.. ట్రూ అప్‌ చార్జీల భారం ఎంతో తెలుసా! అక్షరాలా.. 17వేల 898 కోట్ల రూపాయలు. ఇందులో 6 వేల 72 కోట్ల రూపాయల మేర ట్రూ అప్ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసుకోడానికి ప్రభుత్వం అనుమతించింది. తాజాగా మరో 11 వేల కోట్ల రూపాయల భారం వేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారమంతా యూనిట్ల రూపంలో డివైడ్ చేసి.. రాబోయే 15నెలలపాటు ట్రూఅప్ చార్జెస్ వసూలు చేస్తారన్నమాట..

ఏపీ సర్కార్ పై విపక్ష పార్టీల ఫైర్..

ఓవైపు వైసీపీ తప్పులతోనే ఈ భారమని చంద్రబాబు అంటుంటే.. మరోవైపు పెంపునకు నిరసనగా ఆందోళన చేస్తామంటోంది వైసీపీ. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసి చార్జీలను తగ్గించాలంటోంది.

ఛార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్, వామ పక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి. అటు ఫ్రీ సిలిండర్లు ఇటు బాదుడా అంటూ ప్రశ్నిస్తున్నాయి.

అయితే చంద్రబాబు నుంచి మాత్రం ఒక హామీ వచ్చింది. గత ప్రభుత్వం మోపిన భారాన్ని తగ్గించలేం గానీ.. రాబోయే 5ఏళ్లు మాత్రం తమ వైపు నుంచి ఎలాంటి వడ్డన ఉండదని భరోసా ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ