Andhra Pradesh: బోరుగడ్డ అనిల్‌కి స్టేషన్‌లో రాచ మర్యాదలు.. దుప్పటి, దిండు వేసి.. నెట్టింట వీడియో వైరల్..
గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు.. పలు కేసుల్లో అరెస్టయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు పోలీసులు రాచమర్యాదలు చేస్తుండటం వివాదస్పదంగా మారింది.. మొన్ననే బిర్యానీ తినిపించిన పోలీసులు.. తాజాగా, దుప్పటి, దిండు వేసి స్టేషన్ లో రాచమర్యాదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో బొరుగడ్డ అనిల్ అరెస్టయిన విషయం తెలిసిందే.. ఇప్పటికే.. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో జైలుకు రాజమండి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత పలు కేసుల్లో విచారించేందుకు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి అదుపులోకి తీసుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఓ రౌడీ షిటర్ తో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. అతనికి రాచమర్యాదలు చేస్తూ వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.. రెండు రోజుల క్రితమే రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌తో కలిసి.. పోలీసులు ఓ హోటల్‌లో బిర్యానీలు తిన్నారు.. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది.. దీంతో ఏడుగురు పోలీసులను డీజీపీ ద్వారకా తిరుమల రావు సస్పెండ్ చేశారు.
అయినప్పటికీ.. ఇంకా పోలీసుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు.. విచారణ కోసం బోరుగడ్డ అనిల్ కుమార్‌ని గుంటూరు ఆరండల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు అతనికి సకల సౌకర్యాలు కల్పించడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. ఓ వ్యాపారిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను విచారించేందుకు అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గుంటూరు అరండల్ పేట్ పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేశారు. ఇక్కడ.. పోలీస్ స్టేషన్ సెల్ లో ఉంచాల్సింది పోయి.. బోరుగడ్డ అనిల్ పడుకునేందుకు ఓ టేబుల్ పై దుప్పటి, దిండు వేశారు.
వీడియో చూడండి..
అంతకుముందు బోరుగడ్డ పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నట్లు కనిపించింది.. దీనికి సంబంధిచిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బోరుగడ్డ కంప్యూటర్ ఎదుట ఉన్న కుర్చీలో కూర్చోగా పోలీసులు నిలబడి మాట్లాడుతున్నారు. వారితో ఆయన ఏదో చెపుతుంటే అందరూ వింటూ ఉన్నారు..
అయితే.. పోలీసులు రౌడీ షిటర్ కు ఇలాంటి రాచమర్యాదలు చేయడం బాగలేదంటూ పలువురు నెట్టింట ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
Borugadda Anil కి పోలీసుల రాచ మర్యాదలు!! 😡😡😡😡😡😡😡 pic.twitter.com/jZCBDfnJQu
— Deputy CM Gari Thalluka (@srinu__volley) November 9, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..