రాజధాని సెగ.. అమరావతి ప్రాంత ఎమ్మెల్యేల కీలక సమావేశం

ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనపై రాష్ట్రంలో సెగలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంత ప్రజలు సేవ్ అమరావతి పేరుతో గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సెగలు వైసీపీ ఎమ్మెల్యేలకు అంటుకున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తాడికొంట ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ ప్రకటనపై మాట్లాడకపోవడంతో రాజధాని ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు గత […]

రాజధాని సెగ.. అమరావతి ప్రాంత ఎమ్మెల్యేల కీలక సమావేశం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 26, 2019 | 9:08 AM

ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనపై రాష్ట్రంలో సెగలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంత ప్రజలు సేవ్ అమరావతి పేరుతో గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సెగలు వైసీపీ ఎమ్మెల్యేలకు అంటుకున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తాడికొంట ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ ప్రకటనపై మాట్లాడకపోవడంతో రాజధాని ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు గత కొన్ని రోజులుగా ఈ ఎమ్మెల్యేలు ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో.. వారిపై రైతులు, మహిళలు మిస్సింగ్ కేసులు కూడా నమోదు చేశారు. ఇక ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో గురువారం అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు సమావేశం కానున్నారు.

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం గం.3.30కు నేతలు భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశంలో మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనలు, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంత రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, రైతులకు భరోసా ఇచ్చేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. సమావేశానంతరం ప్రభుత్వ ప్రణాళికను మీడియాకు వివరించనున్నారు. ఇదిలా ఉంటే డిసెంబరు 27న ఏపీ కేబినెట్ సమావేశం కానుండగా.. అందులో జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.