బ్రేకింగ్: టీడీపీ ఎంపీ కేశినేని నాని హౌస్ అరెస్ట్

టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రైతుల ధర్నాలో పాల్గొనకుండా ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేశినేనితో  పాటు టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. తొమ్మిది రోజులుగా అమరావతి ప్రాంత రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వీరికి మిగిలిన వర్గాల నుంచి కూడా మద్దతు లభించడంతో […]

బ్రేకింగ్: టీడీపీ ఎంపీ కేశినేని నాని హౌస్ అరెస్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 26, 2019 | 11:12 AM

టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రైతుల ధర్నాలో పాల్గొనకుండా ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేశినేనితో  పాటు టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. తొమ్మిది రోజులుగా అమరావతి ప్రాంత రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వీరికి మిగిలిన వర్గాల నుంచి కూడా మద్దతు లభించడంతో రాజధాని ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. వన్‌ స్టేట్- వన్ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్- క్యాపిటల్ రాజధాని నినాదాలతో ఆందోళనలు చేస్తున్నారు.

కాగా మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల ఆంక్షలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. మరోవైపు పెద్దమద్దూరులో రైతులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. విజయవాడ-అమరావతి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగి.. రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. సచివాలయం ప్రధాన రహదారిని దిగ్భంధనం చేశారు. దీంతో సచివాలయానికి రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదిలా ఉంటే హైకోర్టుకు కర్నూల్‌కు మార్చాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్, అడ్వకేట్స్ జెఎసితో కలిసి ప్రకాశం బ్యారేజీపై ఇవాళ మెగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనలలో వివిధ జిల్లాల నుండి ప్రాక్టీసింగ్ న్యాయవాదులు పాల్గొననున్నారు. దీంతో రాజధాని ప్రాంతాల్లో ఇప్పుడు హైటెన్షన్ నెలకొంది.