ఎంపీ మురళీమోహన్ ఇంట విషాదం
టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి మాగంటి వసుమతి దేవి (100) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆమె విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతదేహాన్ని ఈ సాయంత్రం రాజమహేంద్రవరంలోని మురళీమోహన్ నివాసానికి తీసుకురానున్నారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించవచ్చునని తెలుస్తోంది.