“ఒకవేళ అమెరికా దాడి చేస్తే.. విధ్వంసమే..” ట్రంప్ వార్నింగ్‌కు ఇరాన్ ధీటైన సమాధానం.. !
మధ్యప్రాచ్య సంఘర్షణ మరింత ప్రమాదకరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ఇంధన కేంద్రాలపై దాడి చేస్తే, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను మరింత పెంచింది. అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని ఇంధన కేంద్రాలు ఇకపై దాడులకు లక్ష్యాలుగా మారతాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది.

మధ్యప్రాచ్య సంఘర్షణ మరింత ప్రమాదకరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ఇంధన కేంద్రాలపై దాడి చేస్తే, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను మరింత పెంచింది. అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని ఇంధన కేంద్రాలు ఇకపై దాడులకు లక్ష్యాలుగా మారతాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది.
ఇదిలావుంటే, “48 గంటల్లోగా ఎలాంటి బెదిరింపులు లేకుండా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే, అమెరికా అతిపెద్ద విద్యుత్ కేంద్రాలతో మొదలుపెట్టి అన్ని విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తుంది” అని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికకు స్పందిస్తూ, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఖిర్ ఖాలిబాఫ్, టెహ్రాన్ మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే, గల్ఫ్‌లోని మొత్తం ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని, అమెరికా పెట్టుబడులపై ప్రభావం పడుతుందని అన్నారు. మరోవైపు, గల్ఫ్‌లోని అమెరికాతో సంబంధం ఉన్న ఇంధన, సాంకేతిక, నీటి మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకోగలమని ఇరాన్ సైనిక అధికారులు తెలిపారు.
ధ్వంసమైన విద్యుత్ ప్లాంట్లను పునర్నిర్మించే వరకు హోర్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేసే ఉంటుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. ప్రపంచ చమురు, గ్యాస్‌లో గణనీయమైన భాగాన్ని రవాణా చేసే ఈ జలసంధి, ప్రపంచంలోని అత్యంత కీలకమైన నౌకా మార్గాలలో ఒకటి. ఇరాన్ దీనిని ఫిబ్రవరి 28న మూసివేసింది. హోర్ముజ్ జలసంధిలో ఈ దిగ్బంధనం ఇప్పటికే ట్యాంకర్ల రాకపోకలను నెమ్మదించాయి. ఇంధన ధరలను పెంచింది. ప్రపంచ మార్కెట్లకు అంతరాయం కలిగించింది.
అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అస్థిరంగానే ఉంది. కొత్త క్షిపణి ప్రయోగం తర్వాత ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడి సైరన్‌లు మోగాయి. మార్చి 21న దాడులు తీవ్రమయ్యాయి. టెహ్రాన్, మధ్య – దక్షిణ ఇరాన్‌తో పాటు హోర్ముజ్ జలసంధి సమీప ప్రాంతాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కేంద్రీకృతమయ్యాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్‌లోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేసింది. ఇదిలావుంటే, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఆ దేశంపై 400కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని IDF తెలిపింది. కానీ వాటిలో చాలా వరకు రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. దాదాపు 92 శాతం క్షిపణులు తమ లక్ష్యాలను చేరకముందే ధ్వంసం చేశామని IDF అధికారులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
