Dhurandhar 2: ‘ధురంధర్ 2’ సినిమా చూసిన రేణూ దేశాయ్.. ప్రధాని మోడీ గురించి ఏమన్నారంటే?
ధురంధర్ 2 సినిమా పట్ల రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను చూస్తున్నారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా నటి రేణూ దేశాయ్ ధురంధర్ 2 సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2) సంచలనాలు సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ధురంధర్ 2 రేంజ్ చూస్తుంటే 2000 కోట్ల టార్గెట్ ను ఈజీగా దాటేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాలో డైరెక్టర్ ఆదిత్య ధర్, రణ్ వీర్ సింగ్ పేర్లు మరోసారి నెట్టింట మార్మోగుతున్నాయి. కేవలం సామాన్యులే కాదు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు థియేటర్లకు వెళ్లి మరీ ధురంధర్ 2 సినిమాను చూస్తున్నారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ధురంధర్ 2 ను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. తాజాగా నటి రేణూ దేశాయ్ ధురందర్ ది రివేంజ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్టులు షేర్ చేశారు. ‘ఈ చాయ్‌వాలా భారతదేశానికి వచ్చినప్పటి నుంచి మన ప్రజలలో భయం పెరిగింది’ అంటూ ‘ధురంధర్ 2’ సినిమాలో బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీం చెప్పే డైలాగ్ కి సంబంధించిన రీల్ ని తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశారు రేణూ దేశాయ్. తన పోస్టుకు ‘చాయ్ వాలా జల్వా’ అని క్యాప్షన్ ఇచ్చిన రేణూ .. ‘నేను బీజేపీకి, మన అద్భుతమైన పీఎం మోదీజీకి గర్వించదగిన అంధ భక్తురాలిని” అని పేర్కొన్నారు.
‘మన సాయుధ దళాలు, నిఘా సంస్థల పట్ల మీకు కనీస గౌరవం ఉన్నా, వారి వల్లే మనం మన సౌకర్యవంతమైన ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నాం, నిద్రపోతున్నాం. మీ సొంత దేశం గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడితే, దయచేసి ధురందర్ 1 & 2 సినిమాలు చూడండి. ధర్మాన్ని పాటించడమే మీ కర్తవ్యం, ప్రతిఫలాన్ని ఆశించడం కాదు. విజయమనే వాగ్దానానికి మోసపోకండి. యుద్ధభూమి పిలుస్తోంది, కార్యాచరణలో ధైర్యంగా ఉండు’ అని తన పోస్టుల్లో రాసుకొచ్చారు రేణూ దేశాయ్. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
రేణూ దేశాయ్ పోస్ట్..
Renu Desai, a devoted supporter of Narendra Modi, urges patriotic audiences to watch both parts of Dhurandhar ❤️🔥#dhurandhar #dhurandhartherevenge #renudesai #ranveersingh #adityadhar pic.twitter.com/22HMlScisa
— Media Mic | Indian Cinema | Tollywood (@MMTollywood) March 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




