అమరావతి రైతు జలదీక్ష
రాజధాని ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. రాజధాని తరలింపుపై ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమౌతున్నాయి. అమరావతి ప్రాంత గ్రామాల్లోని ప్రజలంతా ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. విద్యార్ధులతో పాటు చిన్నా పెద్దా అందరూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఎనిమిదో రోజూ రాజధాని గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాళ్లాయపాలెం రేవులో రైతులు జలదీక్ష చేపట్టారు. నడుము లోతు నీళ్లలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే ఉంచాలన్నారు. నవ్యాంధ్ర రాజధాని కోసం 30వేల ఎకరాలకు పైగా […]
రాజధాని ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. రాజధాని తరలింపుపై ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమౌతున్నాయి. అమరావతి ప్రాంత గ్రామాల్లోని ప్రజలంతా ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. విద్యార్ధులతో పాటు చిన్నా పెద్దా అందరూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఎనిమిదో రోజూ రాజధాని గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాళ్లాయపాలెం రేవులో రైతులు జలదీక్ష చేపట్టారు. నడుము లోతు నీళ్లలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే ఉంచాలన్నారు. నవ్యాంధ్ర రాజధాని కోసం 30వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చామని గుర్తు చేశారు. తమ త్యాగాలను కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చుతున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ పోరాటం ఆపేదని లేదని రైతులు తేల్చి చెప్పారు.