ఎన్నికల కమిషన్‌పై మండిపడ్డ జగ్గారెడ్డి

తాజాగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఫైర్ అయ్యారు. ఈసీ పూర్తిగా అధికార టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తుందంటూ ఆరోపించారు. ఈసీ కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికల అధికారా.. లేక టీఆర్ఎస్ కార్యకర్తనా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే.. టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్‌బుక్‌లలోకి షెడ్యూల్ ఎలా వచ్చిందంటూ […]

ఎన్నికల కమిషన్‌పై మండిపడ్డ జగ్గారెడ్డి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 25, 2019 | 12:16 PM

తాజాగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఫైర్ అయ్యారు. ఈసీ పూర్తిగా అధికార టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తుందంటూ ఆరోపించారు. ఈసీ కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికల అధికారా.. లేక టీఆర్ఎస్ కార్యకర్తనా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే.. టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్‌బుక్‌లలోకి షెడ్యూల్ ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీని ఈసీ, పోలీస్ వ్యవస్థలే కాపాడుతున్నాయన్నారు. అసలు పండుగల సమయంలో ఈ ఎన్నికలు నిర్వహించడంపై సీఈసీకి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ విషయంపై పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొరతానంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.