ప్రేమిస్తున్నానని చెల్లెలికి వేధింపులు,.. తల్లి మృతి..!
కొంతమంది మానవసంబంధాలు మంటల్లో కలుపుతున్నారు. అమ్మాయి కనిపిస్తే… వరసకు ఏం అవుతుందో కూడా ఆలోచించకుండా ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఓ యువకుడు వావి వరసలు మార్చిపోయి చెల్లినే ప్రేమించాడు. అంతేనా ఆమె ఒప్పుకోలేదని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అది భరించలేక ఆ యువతి తల్లి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మహబూబబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. కూతురు ని ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకుంటానని ఓ […]
కొంతమంది మానవసంబంధాలు మంటల్లో కలుపుతున్నారు. అమ్మాయి కనిపిస్తే… వరసకు ఏం అవుతుందో కూడా ఆలోచించకుండా ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఓ యువకుడు వావి వరసలు మార్చిపోయి చెల్లినే ప్రేమించాడు. అంతేనా ఆమె ఒప్పుకోలేదని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అది భరించలేక ఆ యువతి తల్లి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
మహబూబబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. కూతురు ని ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకుంటానని ఓ యువకుడి బెదిరింపుతో, ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గుగులోత్ సునీత అనే యువతి ని బోడ అనిల్ అనే యువకుడు..మాయమాటలు చెప్పి నమ్మించాడు. తనకు బావ వరుస అవుతానని, తనను ప్రేమించాలంటూ వెంటపడటం మొదలుపెట్టాడు. యువతి మాత్రం అనిల్ ను ప్రేమించలేనని, కారణం ఇద్దరం అన్నా చెల్లెల్లు వరుస అవుతామని తేల్చి చెప్పింది. ఈ విషయం కుల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ వరకు వెళ్ళింది.
దీంతో ఇరు కుటుంబాలను పిలిచి విచారించిన కులపెద్దలు వారు నిజంగానే అన్నా చెల్లెలు అవుతారని తేల్చిచెప్పారు. తన ప్రవర్తన మార్చుకోవాలని అనిల్ ని మందలించారు. అయినా అనిల్ తన బుద్ధి మార్చుకోలేదు. సునీతను ఎలాగైనా కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిపోయిన సునీత తల్లి గుగులోత్ పద్మ పరువు పోతుందని భావించి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పద్మ మృతికి కారణమైన అనిల్‌ని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.