Andhra Pradesh: తమ్ముడు వైసీపీ.. అన్న జనసేన.. గిద్దలూరుకు ఖరారైన జనసేన అభ్యర్థి

| Edited By: Aravind B

Jul 12, 2023 | 2:37 PM

ప్రకాశంజిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి స్వాములు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న వార్త రాజకీయాల్లో ఆశక్తిగా మారింది. చీరాల నియోజకవర్గంలో తన తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి తెరవెనుక రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఆమంచి స్వాములుకు పేరుంది.

Andhra Pradesh: తమ్ముడు వైసీపీ.. అన్న జనసేన.. గిద్దలూరుకు ఖరారైన జనసేన అభ్యర్థి
Amanchi Swamulu And Pawan Kalyan
Follow us on

ప్రకాశంజిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి స్వాములు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న వార్త రాజకీయాల్లో ఆశక్తిగా మారింది. చీరాల నియోజకవర్గంలో తన తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి తెరవెనుక రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఆమంచి స్వాములుకు పేరుంది. దీంతో తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్‌ పర్చూరు వైసీపీ ఇన్‌చార్జిగా ఉండగా అన్న ఆమంచి స్వాములు జనసేనలో చేరడం ఇటు చీరాల, అటు గిద్దలూరులో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈనెల 15వ తేదిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నారు స్వాములు. చీరాల నియోజకవర్గానికి చెందిన కాపు సంఘాల నాయకుడిగా ఉన్న ఆమంచి స్వాములు పెద్దసంఖ్యలో అన అభిమానులతో కలిసి వెళ్ళి పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గం అయితే సేఫ్‌గా ఉంటుందని ఆమంచి స్వాములు భావిస్తున్నారు. ప్రస్తుతం గిద్దలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు గతంలో 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ప్రజారాజ్యం టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో కాపు సామాజిక వర్గం నేతలు అన్నా రాంబాబుకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు తాను జనసేన నుంచి పోటీ చేస్తే గెలుపు నల్లేరుపై నడకలా ఉంటుందని అనుకుంటున్నారు.

మరోవైపు కంభం పట్టణంలో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలోని రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశానికి ఆమంచి స్వాములు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు, ప్రకటనలు చేశారు. ఈనెల 15వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నానని స్వాములు తెలిపారు. అలానే తాను గిద్దలూరు నుంచి పోటీ చేయబోతున్నానని అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని తెలిపారు. బలిజ సామాజిక వర్గం తో పాటు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లి గిద్దలూరులో విజయం సాధిస్తానని తెలిపారు. అవసరమైతే గిద్దలూరులో స్థిర నివాసం ఏర్పరచుకుంటానని ఇక్కడే ఉండి గిద్దలూరు అభివృకి సహకరిస్తానని చెబుతున్నారు. ఇంకా పార్టీలో చేరకుండానే ప్రజలందరూ తనను ఆదరించి గెలిపించాలని ఆమంచి స్వాములు కొరుతుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాశమైంది.

( రిపోర్టర్ : ఫైరోజ్‌ బేగ్‌, టీవీ9 )

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..