AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ ప్రాంతంలో రెచ్చిపోతున్న ఒంటరి ఏనుగు.. భయందోళనలో స్థానికులు

పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో హరి ఒంటరి ఏనుగు భీభత్సం సృష్టిస్తుంది. గుంపు నుండి విడిపోయిన ఏనుగు జనవాసాల్లో హల్ చల్ చేస్తుంది. ఏనుగు ధాటికి మన్యంవాసులు హడలెత్తి పోతున్నారు. గత కొద్ది రోజులుగా గుంపులో కలిసికట్టుగా సంచరించిన ఏనుగు గుంపు నుండి విడిపోయి గుంపుకు దూరంగా ఉంటుంది. నిత్యం గుంపులో ఉండే ఏనుగు ఒక్కసారిగా దూరం కావడంతో రెచ్చిపోయి నానా హంగామా చేస్తుంది. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.

Andhra Pradesh: ఆ ప్రాంతంలో రెచ్చిపోతున్న ఒంటరి ఏనుగు.. భయందోళనలో స్థానికులు
Elephant
Gamidi Koteswara Rao
| Edited By: Aravind B|

Updated on: Sep 04, 2023 | 3:50 PM

Share

పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో హరి ఒంటరి ఏనుగు భీభత్సం సృష్టిస్తుంది. గుంపు నుండి విడిపోయిన ఏనుగు జనవాసాల్లో హల్ చల్ చేస్తుంది. ఏనుగు ధాటికి మన్యంవాసులు హడలెత్తి పోతున్నారు. గత కొద్ది రోజులుగా గుంపులో కలిసికట్టుగా సంచరించిన ఏనుగు గుంపు నుండి విడిపోయి గుంపుకు దూరంగా ఉంటుంది. నిత్యం గుంపులో ఉండే ఏనుగు ఒక్కసారిగా దూరం కావడంతో రెచ్చిపోయి నానా హంగామా చేస్తుంది. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆంధ్రా ఒడిశా అంతర్జాతీయ రహదారి పై హల్ చల్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అర్ధాం వద్ద రోడ్డెక్కి వాహనదారుల పై దూసుకెళ్లింది. ఆ సమయంలోనే అటుగా వచ్చిన ప్రవేట్ బస్సును అడ్డుకుంది. బస్సు వద్దకు చేరుకొని బస్సు అద్దాలు ధ్వంసం చేసింది. ఏనుగును గమనించిన ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. బస్సు ధ్వంసం అయ్యింది.

ఆ తర్వాత స్థానికులపై దాడి చేసే ప్రయత్నం చేసింది. ఏనుగు దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఏనుగు బీభత్సాన్ని స్థానికులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. దీంతో స్థానికులు మరింత ఆందోళనలో ఉన్నారు. ఒంటరి ఏనుగు గత కొద్ది రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున గీంకారాలు చేస్తూ గ్రామాలపై పడుతుంది. పంట నష్టం చేయడంతో పాటు గ్రామాల్లోని పశువులపై సైతం దాడి చేస్తుంది. పశువుల సాలలను, పంట పొలాలను ధ్వంసం చేస్తుంది. ఎప్పుడైనా గుంపు నుండి తప్పిపోతే ఒక రోజు, రెండు రోజుల్లో గుంపులో కలిసిపోయే ఏనుగు ఈ సారి మాత్రం సుమారు పదిహేను రోజులు దాటినా గుంపు వైపు కన్నెత్తి చూడటం లేదు. గుంపులో కలవడానికి నానా అవస్థలు పడుతుంది. అంతేకాకుండా రెచ్చిపోయి హల్ చల్ చేస్తుంది. అటవీశాఖ అధికారులు ఒంటరిగా తిరుగుతూ భీభత్సం సృష్టిస్తున్న ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

ఎప్పుడు ఏ గ్రామం పై పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. మరోవైపు ఏనుగుల గుంపు పై కూడా అధికారులు పర్యవేక్షణ పెంచారు. అలా ఏనుగుల పై నిఘా పెంచడంతో పాటు ఒంటరి ఏనుగు రెచ్చిపోయి గ్రామాల మీద పడుతుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఏనుగు గుంపులో కలిసే అవకాశం లేదని సూచిస్తున్నారు. అంతే కాకుండా హరి అనే ఏనుగు దూరం కావడంతో ఏనుగులు గుంపు సైతం గ్రామాల మీద పడే అవకాశం ఉందని స్థానికులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు స్థానికులు కూడా ఆ ఏనుగును అదుపులోకి తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ఆ ఏనుగు వల్ల ఏదైన ప్రాణ నష్టం జరిగితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా అటవీ అధికారులు కూడా ఆ ఏనుగును అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం