Andhra Pradesh: పెరుగుతున్న జ‌నాభాకు ప్ర‌స్తుత‌ వ్య‌వ‌సాయం స‌రిపోతుందా..? ఆగ్రోఎకో 2050 రిపోర్ట్ నివేధికలో షాకింగ్‌ విషయాలు..

Vijayawada: ఈ నివేదిక‌కు సంబంధించిన‌ అధ్యయన ఫలితాల‌పై కేంద్ర‌ వ్యవసాయ మంత్రిత్వ శాఖతో రైతు సాధికార సంస్థ చర్చించింది.స‌హ‌జ‌,ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా ఒక హెక్టారుకు మొక్కల ఆహార కేలరీల మొత్తం దిగుబడి 2019లో 31వేల‌ కిలో కేలరీలు ఉంటే 2050 నాటికి 36వేల కిలో కేలరీలకు పెరుగుతుందని అంచనా వేసింది.

Andhra Pradesh: పెరుగుతున్న జ‌నాభాకు ప్ర‌స్తుత‌ వ్య‌వ‌సాయం స‌రిపోతుందా..?  ఆగ్రోఎకో 2050 రిపోర్ట్ నివేధికలో షాకింగ్‌ విషయాలు..
Organic Farming
Follow us
S Haseena

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 17, 2023 | 1:23 PM

విజయవాడ,అక్టోబర్17; ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌ధాన జీవ‌నాధారం వ్య‌వ‌సాయం…రాష్ట్రంలో ఎక్కువ‌మంది వ్యవ‌సాయంపైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నారు…ఇలాంటి వ్య‌వ‌సాయ రంగాన్ని రైతుల‌కు లాభ‌సాటిగా మార్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంది..రైతుల‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు క‌ల్పించ‌డంతో పాటు విత్త‌నాలు,ఎరువులు అన్నీ కూడా ప్ర‌భుత్వ‌మే నేరుగా రైతుల‌కు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటుంది…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏర్పాటుచేసిన రైతు భ‌రోసా కేంద్రాలు రైతుల‌కు వ‌రంగా మారాయి…ఈ క్రాపింగ్ నుంచి పండించిన పంటలు అమ్ముకునే వ‌ర‌కూ ఆర్బీకేల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ప్ర‌భుత్వం..రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఖ‌చ్చితంగా వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ ప‌దేప‌దే అధికారుల‌ను ఆదేశిస్తున్నారు…ప‌ర్యావ‌ర‌ణ అనుకూలంగా ఉండే స‌హ‌జ‌సిద్ద వ్య‌వ‌సాయానికి కూడా అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంది ప్ర‌భుత్వం…రైతుల‌కు త‌క్కువ పెట్టుబ‌డితో ప‌ర్యావ‌ర‌ణ హితంగా ఉండేలా నేచుర‌ల్ ఫార్మింగ్ ను ప్రోత్స‌హిస్తుంది…ఇక రాష్ట్ర సుస్థిర అభవృద్దికి రాబోయే రోజుల్లో మ‌రింత వృద్ది రేటు పెరిగేందుకు ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తాజాగా వెల్ల‌డించింది..దీనికి సంబంధించి రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగంపై రైతు సాధికార స‌మితి ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో క‌లిసి ఓ నివేదిక‌ను సిద్దం చేసింది.ఆగ్రో ఎకో 2050 నివేదిక ద్వారా రాష్ట్రంలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం- ప్ర‌యోజ‌నాలను వివ‌రించింది.

ఆగ్రో ఎకో 2050 నివేదిక‌లో కీల‌క అంశాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్థిర‌మైన వ్య‌వ‌సాయ వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌డం కోసం స‌హ‌జ వ్య‌వ‌సాయాన్ని ఎక్కువ‌గా పాటించ‌డం ప్ర‌ధాన మార్గం అని ఆగ్రో ఎకో 2050 నివేదిక పేర్కొంది.స‌హ‌జ,ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా స్ధిర‌మైన వ్య‌వ‌సాయ వ్య‌వ‌స్థ‌నున నిర్మించ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ఆంధ్రప్రదేశ్‌లో రైతుసాధికార సంస్థ , ఫ్రెంచ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, మరియు యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ క‌లిసి ఈ నివేదిక‌ను రూపొందించాయి.స‌హ‌జ వ్య‌వ‌సాయం,ఆగ్రో ఎకాల‌జీ,పారిశ్రామిక వ్య‌వ‌సాయం పై అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత రాబోయే రోజుల్లో ఎలాంటి వ్య‌వ‌సాయానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌నే దానిపై ఈ నివేదిక‌లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు..ముఖ్యంగా జ‌నాభా పెరుగుద‌ల‌,వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల అవ‌స‌రం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని 2050 వ‌ర‌కూ అవ‌స‌ర‌మైన వాటిపై నివేదిక ఇచ్చింది…వ్య‌వ‌సాయం ద్వారా రాష్ట్రఆనికి స్ధిర‌మైన భ‌విష్య‌త్తు మార్గాన్ని ఇచ్చేలా ఆగ్రోఎకో 2050లో పేర్కొన్నారు.2020 నాటికి ఐదు కోట్లపైబ‌డిన జనాభా కలిగిన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, 2050లో 60 మిలియన్ల జనాభాను చేరుకుంటుందని అంచ‌నా వేసారు…అయితే పెరుగుతున్న జ‌నాభాకు త‌గ్గ‌ట్లుగా ఆహారం,ఉపాధి మరియు ఆర్థిక వృద్ధికి పెరుగుతున్నడిమాండ్‌లను తీర్చడానికి ప్రస్తుతం ఉన్న‌ వ్యవసాయ వ్యవస్థలను పునఃపరిశీలించవలసి ఉంటుందని నివేదిక‌లో పేర్కొన్నారు..అటు పారిశ్రామిక వ్యవసాయం విషయంలో,సింథటిక్ రసాయనాలపై ఆధారపడిన సాంప్రదాయిక విధానం కూడా సగానికి తగ్గించబడింది,

ఇవి కూడా చదవండి

2050 వ‌ర‌కూ వ్య‌వసాయంలో తీసుకోవ‌ల్సిన చ‌ర్య‌ల‌పై నివేదిక‌

2019 నుండి 2050 వరకు వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల GVAలో 6 శాతం వార్షిక వృద్ధిని సాధించగలదని అంచనా వేసారు..వ్యవసాయ శాస్త్రం ద్వారా ఆర్థిక రంగం ఆశాజనకంగా ఉందని అధ్యయనం పేర్కొంది.రైతులకు ఆదాయం గణనీయంగా ఉండ‌టంతో పాటు రైతు అభివృద్ధి కి దారి తీస్తుంద‌ని పేర్కొంది..అయితే వ్య‌వ‌సాయంలో ఎదుర్కొటున్న ప్ర‌ధాన స‌వాళ్ల‌లో స్థిరమైన భూ వినియోగం ఒక‌ట‌ని నివేదిక లో పేర్కొన్నారు..సహజ వ్యవసాయం ద్వారా బీడు మరియు బంజరు భూముల పునరుత్పత్తి ఉంటుంద‌ని పేర్కొన్నారు..2050 నాటికి సాగు విస్తీర్ణాన్ని 8 మిలియన్ హెక్టార్లకు పైగా పెంచుతుందని పేర్కొన్నారు…వాతావరణ మార్పులను తగ్గించడానికి నేల సేంద్రీయ కార్బన్నేల ఆరోగ్యం మరియు వ్యవసాయ-జీవవైవిధ్యాన్ని స‌హ‌జ వ్య‌వ‌సాయం ప్రోత్స‌హిస్తుంద‌ని ఆగ్రోఎకో 2050 లో పొందుప‌రిచారు..ఈ నివేదిక‌కు సంబంధించిన‌ అధ్యయన ఫలితాల‌పై కేంద్ర‌ వ్యవసాయ మంత్రిత్వ శాఖతో రైతు సాధికార సంస్థ చర్చించింది.స‌హ‌జ‌,ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా ఒక హెక్టారుకు మొక్కల ఆహార కేలరీల మొత్తం దిగుబడి 2019లో 31వేల‌ కిలో కేలరీలు ఉంటే 2050 నాటికి 36వేల కిలో కేలరీలకు పెరుగుతుందని అంచనా వేసింది.

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..