RGV: ఇండియన్ ఆర్మీపై కామెంట్స్.. మరో వివాదంలో ఆర్జీవీ!
తన వ్యాఖ్యలు, చేష్టలో తరచూ వార్తల్లో కనిపించే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అసభ్యకర పోస్ట్‌ల కేసులో ఇటీవలే ఆరోపణలు ఎదుర్కొన్ని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. భారత ఆర్మీని చులకన చేసి మాట్లాడారని ఓ వ్యక్తి ఆర్జీవీపై పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అడ్వకేట్ మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. రామ్‌గోపాల్ వర్మ భారత ఆర్మీని చులకన చేసి మాట్లాడారని, మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్జీవీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనపై ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్యకర పోస్ట్‌లు చేశారని ఆయనపై గతంలో కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు కులాల మధ్య చిచ్చుపెట్టేలా సినిమాలు చిత్రీకరించారని, చంద్రబాబు, లోకేశ్‌పై వ్యంగ్యంగా సీన్లు చేశారని కేసులు నమోదు అయ్యాయి. అయితే కొన్ని కేసుల్లో ఇటీవలే రాంగోపాల్ వర్మకు ఊరట లభించినట్టు తెలుస్తోంది. మరి కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ కూడా వచ్చినట్టు సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
