నిన్న కాల్పులు..నేడు సూసైడ్..ఆర్మీ జవాన్ కథ విషాదాంతం

ప్రేమించాడు. అవతలి వ్యక్తిని మనసును అర్థం చేసుకోలేకపోయాడు. పదే, పదే వెంటపడి వేధించాడు. చివరికి ప్రేమించిన అమ్మాయి తల్లిపై కాల్పులకు తెగబడ్డాడు. అలాగని అతడు సైకో కాదు. బాధ్యాతాయుతమైన వృత్తిలో ఉన్న ఆర్మీ జవాను.

నిన్న కాల్పులు..నేడు సూసైడ్..ఆర్మీ జవాన్ కథ విషాదాంతం
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 4:05 PM

ప్రేమించాడు. అవతలి వ్యక్తిని మనసును అర్థం చేసుకోలేకపోయాడు. పదే, పదే వెంటపడి వేధించాడు. చివరికి ప్రేమించిన అమ్మాయి తల్లిపై కాల్పులకు తెగబడ్డాడు. అలాగని అతడు సైకో కాదు. బాధ్యాతాయుతమైన వృత్తిలో ఉన్న ఆర్మీ జవాను. చివరికి తన ప్రాణాలు తానే తీసుకోని బ్రతుకును అర్థాంతరంగా ముగించాడు.

నడింపల్లిలో నివశించే రమాదేవి కూతుర్ని ఆర్మీ జవాన్ బాలాజీ గత కొద్దికాలంగా ప్రేమిస్తున్నాడు.ఆ విషయాన్ని ఆమెకు చెప్పి..ప్రేమించాలంటూ వెంటపడ్డాడు..అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్లకు బాలాజీ వేధింపుల గురించి తెలియజేసింది. దీంతో యువతి తల్లి రమాదేవి అతడికి వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి తన కూతురు ఊసు ఎత్తొద్దని గట్టిగానే చెప్పింది. దీంతో అతడు పగ పెంచుకున్నాడు. ఓ నాటు తుపాకీతో శనివారం యువతి తల్లిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆమె స్వల్ప గాయాలతో తప్పించుకుంది.  దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అనూహ్యంగా బాలాజీ ఆదివారం ఉదయం సూసైడ్ చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కిందపడి తన జీవితానికి ఎండ్ కార్డు వేసుకున్నాడు.

ఇది కూడా చదవండి : భార్య ప్రసవం కోసం ఆస్పత్రిలో..భర్త గుండెపోటుతో మృతి..