భార్య ప్రసవం కోసం ఆస్పత్రికి…భర్త గుండెపోటుతో మృతి..

అమెరికాలోని డల్లాస్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తోన్న గజ్వేల్‌కు చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(36) ఈ నెల19న ఆకస్మికంగా హార్ట్ అటాక్‌తో చనిపోయాడు.

భార్య ప్రసవం కోసం ఆస్పత్రికి...భర్త గుండెపోటుతో మృతి..
Follow us

|

Updated on: Feb 24, 2020 | 4:09 PM

అమెరికాలోని డల్లాస్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తోన్న గజ్వేల్‌కు చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(36) ఈ నెల19న ఆకస్మికంగా హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. ఆఫీస్‌లోనే వర్క్ చేస్తుండగా.. అతడికి తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో, మిగిలిన స్టాఫ్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే ప్రశాంత్ కన్నుమూశాడు. కాగా 5 సంవత్సరాల క్రితం ప్రశాంత్‌కు దివ్య అనే యువతితో పెళ్లైంది. వీరికి అదితి అనే 3 ఏళ్ల పాప ఉంది. ప్రశాంత్‌కు గుండెపోటు వచ్చిన సమయంలో..దివ్య రెండోసారి  ప్రసవం కోసం హాస్పటల్‌లో ఉంది. అయితే ఆ సమయంలో ఆమెకు భర్త చనిపోయిన విషయం చెప్పడం కరెక్ట్ కాదని భావించిన సన్నిహితులు..విషయాన్ని దాచి ఉంచారు.

కాగా ఈ నెల 20న దివ్య పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెకు భర్త మరణ వార్తను తెలియజేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రశాంత్ రెడ్డి మృతదేహాన్ని గజ్వేల్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా..అందుకు పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఈ నెల 22న డల్లాస్‌లోనే అతడు అంత్యక్రియలు జరిపారు. మంత్రి కేటీఆర్ అమెరికా ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతుడి సోదరుడు ప్రమోద్ రెడ్డికి వీసా వచ్చేలా ఏర్పాటు చేశారు. దీంతో అతడు అక్కడికి వెళ్లి ప్రశాంత్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి : గుడ్ న్యూస్..తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు..!