AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt: రైతులకు ముఖ్య గమనిక.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఇకపై పంటల బీమా, రాయితీ విత్తనాలకు..

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు పంటల బీమా, రాయితీ విత్తనాలు..

AP Govt: రైతులకు ముఖ్య గమనిక.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఇకపై పంటల బీమా, రాయితీ విత్తనాలకు..
Jagan
Shiva Prajapati
|

Updated on: Apr 13, 2021 | 7:40 AM

Share

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు పంటల బీమా, రాయితీ విత్తనాలు పొందాలంటే ఆధార్ గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్కార్.. ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రైతు భరోసా కేంద్రం నిర్వాహకులకు మార్గర్శనం చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయం, రాయితీలు, ఇతర సేవలకు ఆధార్ ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ అర్హులైన రైతులకు ఆధార్ లేకపోతే.. ముందుగా ఆధార్ నమోదు చేయించుకోవాలని పేర్కొంది. కాగా, రైతు భరోసా కేంద్రాల్లో ఆధార్ నమోదు కోసం ఎనిమిది రకాల గుర్తింపు పత్రాలు, లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రైతులు ప్రభుత్వ రాయితీ పథకాలను పొందటానికి బహుళ ధ్రువీకరణ పత్రాల అవసరాన్ని తొలగించి, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగానే ఆధార్‌ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవో స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించడం, జీరో వడ్డీతో రుణాలు అందిస్తోంది. కోల్డ్ స్టోరేజ్‌లు, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. రైతులకు ప్రయోజనం కలిగేలా రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది.

Also read:

Bank holidays April 2021: బ్యాంక్ కస్టమర్స్ బీ ఎలర్ట్.. ఈ వారంలో ఎన్ని సెలవులు వచ్చాయంటే..!

Common Examination: ఎడ్‌సెట్‌ పరీక్ష విధానంలో ప్రభుత్వం మార్పులు.. సబ్జెక్టుల వారీగా ర్యాంకుల విధానం రద్దు

Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాధి ఆస్థానం.. ఆగమ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం..