AP News: సేమ్ టు సేమ్.. దిశ ఎన్‌కౌంటర్ సీన్.. ఎక్కడో తెలుసా?

పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల అదుపులో ఉన్న కర్రి రాకేష్ అనే యువకుడు రైలు క్రింద పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే పోలీసుల అదుపులో ఉన్న రాకేష్ మృతికి పోలీసులే కారణమని రాకేష్ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మండలం గోపాలపురంలో ఓ మైనర్ బాలికపై డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కర్రి రాకేష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

AP News: సేమ్ టు సేమ్.. దిశ ఎన్‌కౌంటర్ సీన్.. ఎక్కడో తెలుసా?
Young Man Died Suspiciously
Follow us
G Koteswara Rao

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 17, 2024 | 9:47 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల అదుపులో ఉన్న కర్రి రాకేష్ అనే యువకుడు రైలు క్రింద పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే పోలీసుల అదుపులో ఉన్న రాకేష్ మృతికి పోలీసులే కారణమని రాకేష్ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మండలం గోపాలపురంలో ఓ మైనర్ బాలికపై డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కర్రి రాకేష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాకేష్‌పై ఫిర్యాదు వచ్చిందని, రాకేష్‌ను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో తమకు అప్పగించాలని రూరల్ ఎస్సై దినకర్ రాకేష్ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో రాకేష్‌ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పోలీసులకు తల్లిదండ్రులు అప్పగించారు.

అనంతరం రాకేష్‌ను దర్యాప్తు చేయగా తాను మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. రాకేష్ స్టేషన్ నుండి పారిపోయి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. పోలీసులు అదుపులో ఉన్న రాకేష్ మృతికి పోలీసులే కారణమని ఆందోళనకు దిగారు. తప్పు ఒప్పుకున్న తమ కుమారుడిని చట్టప్రకారం శిక్షించాలి తప్పా ఇలా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ మృతికి కారణమైన పోలీసులను కఠినంగా శిక్షించాలని రాకేష్ మృతదేహంతో మన్యం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి గమనించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ భాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి