మొదటి భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలు కోసిన రెండో భార్య..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. మొదటి భార్య ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని.. భర్త మర్మాంగాలను రెండో భార్య కోసేయడం స్థానికంగా కలకలం రేపింది.

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. మొదటి భార్య ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని.. భర్త మర్మాంగాలను రెండో భార్య కోసేయడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లైన కొన్నిరోజులకు వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. దీంతో ఇద్దరు విడిపోయారు. అయితే ఆనంద్ బాబు గత ఏదేళ్ల క్రితం వరమ్మ అమే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ముప్పాళ్లలో నివాసం ఉంటున్న ఆనంద్ 5 నెలల క్రితమే నందిగామకి మకాం మార్చాడు.
అయితే శుక్రవారం రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తూ తన రెండో భార్య వరమ్మకు దొరికిపోయాడు. ఆగ్రహించిన వరమ్మ తనను రెండో పెళ్లి చేసుకోని ఇంకా మొదటి భార్య వీడియోలు ఎందుకు చూస్తున్నావని అతడితో గొడవ పడింది. ఇరువురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరగా ఒకరినొకరు కొట్టుకున్నారు. అంతటితో ఆగని వరమ్మ భర్త ఆనంద్ బాబుపై బ్లేడ్‌తో మర్మాంగలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..