Andhra Pradesh: మద్యం తాగని.. మాంసం తినని గ్రామం.. వందల ఏళ్ళుగా వింత ఆచారం..!

పొలిమేర దాటి ఊళ్లోకి రావాలి అన్న కట్టుబాటు ఇప్పటికీ కొనసాగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆఖరికి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం కోసం ఇచ్చే కోడిగుడ్డు కూడా అడిగుప్ప గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిషేధం.

Andhra Pradesh: మద్యం తాగని.. మాంసం తినని గ్రామం.. వందల ఏళ్ళుగా వింత ఆచారం..!
No Liquor, No Non Veg
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Nov 02, 2024 | 7:52 PM

కోడి కూసింది.. తెల్లారింది.. ఇక లేవండి అని గ్రామాల్లో మనం తరచూ వింటుంటాం. అంటే కోడి కూస్తే తెల్లారినట్లు అని అర్థం. మరీ కోడే కూయని గ్రామం ఉందా? అసలు ఉంటుందా..? అంటే.. అలాంటి ఓ గ్రామం ఉంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఆ గ్రామంలో మందు, ముక్క ముట్టుకోరు. అంటే ఆ గ్రామస్తులు గ్రామంలో మద్యం తాగడం, నాన్ వెజ్ తినడం నిషేధం. ఎన్నో ఏళ్లుగా వస్తున్న వింత కట్టుబాటు, సాంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆఖరికి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం కోసం ఇచ్చే కోడి గుడ్డు కూడా ఆ గ్రామంలో చదువుకునే విద్యార్థులకు ఇవ్వరు..!

ఈ రోజుల్లో మంచినీళ్లు దొరకని ప్రదేశం ఉంది గానీ, మందు, ముక్క దొరకని ప్లేస్ ఉంటుందా? అని అనుమానం వచ్చిన వాళ్లకు అనంతపురం జిల్లాలోని ఆ గ్రామానికి వెళ్తే సమాధానం దొరుకుతుంది. అవును జిల్లాలోని గుమ్మగట్ట మండలం అడిగుప్ప గ్రామంలో నేటికీ అక్కడ మందు, ముక్క ముట్టరు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఆ గ్రామంలో కోడి, కోడిగుడ్డు కనిపించడానికే వీల్లేదు. మందు, ముక్క తినాలని నోరూరే వాళ్ళు ఊరు వదిలి పక్క గ్రామంలోకి వెళ్లి తిని రావాల్సిందే..! అయితే కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామంలో మద్యం, కోడి మాంసం లాంటివి తినకూడదని పెట్టుకున్న కట్టుబాటును తప్పకుండా గ్రామస్తులు ఇప్పటికీ పాటిస్తున్నారు.

గ్రామంలో మందు, ముక్క ముట్టుకోకపోవడానికి పెద్ద చరిత్రే ఉంది. అడిగుప్ప గ్రామంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచే కల్లు, సారా, మందు, చికెన్ తినరు తాగరు. అదే ఈ గ్రామం ప్రత్యేకత. పూర్వం అడిగుప్ప కోటను పాలేగారు వంశస్థులు పాలించేవారు. అడిగుప్ప కోటలో ధనధాన్యాలు విరివిగా ఉండేవని, వాటిని దోచుకునేందుకు చుట్టుపక్కల రాజ్యాలను పాలిస్తున్న రాజులు అడుగు కోటపై కన్నేశారట. అలా ఓసారి చిత్రదుర్గం రాజ్యాన్ని పరిపాలిస్తున్న బుడిగే చిన్నయ్య అడిగుప్ప కోటపై దండయాత్రకు వచ్చారు. కోటపై దండయాత్ర చేసేందుకు ఓ పథకం రచించారట. ముందుగా ఓ సైనికుడిని గ్రామంలోకి పంపి గ్రామస్తులను మత్తులో దించేలా మద్యం తాగించి, మాంసం తినిపించడంతో సైనికులతో పాటు గ్రామస్తులు నిద్రలోకి జారుకున్నారట.

అయితే అప్పుడు అడిగుప్ప కోటను పాలిస్తున్న రాజు కలలోకి దేవుడు వచ్చి కోటను ముట్టడిస్తున్నారని చెప్పారట. కోట నుంచి తాను సైన్యంతో వచ్చేవరకు శత్రు సైనికులను కదలకుండా చేయమని అడిగుప్పకోట పాలిస్తున్న రాజు దేవుడిని వేడుకున్నారట. అలా చేస్తే మీరు అడిగినది నెరవేరుస్తానని రాజు వాగ్దానం చేశారట. అనంతరం రాజు తన సైన్యంతో కోట నుంచి వచ్చి శత్రు సైనికులను చంపడంతో పాటు.. శత్రు సైనికుల సైన్యాధికారి తలనరికి కోట దగ్గర సమాధి కట్టారట. తన రాజ్యాన్ని కాపాడిన దేవుడి కోసం అడిగుప్పు కోట రాజు ఆ గ్రామంలో 150 ఎకరాల భూమిని ధారాదత్తం చేసి గుడి నిర్మించారట. ఇక ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరు మద్యం సేవించరాదని, కోడి మాంసం తినరాదని ప్రతిజ్ఞ చేయించారట.

అలా నాటి నుంచి నేటి వరకు ఈ సాంప్రదాయం… కట్టుబాటు కొనసాగుతూ వస్తోంది. కాలానుగుణంగా అన్ని మారుతున్న ఈ రోజుల్లో కూడా పూర్వీకుల కట్టుబాటులను గౌరవిస్తూ… గ్రామంలో మద్యం, మాంసం ముట్టుకోకుండా వింత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా మద్యం తాగాలి.. మాంసం తినాలి అనిపిస్తే ఊరి బయటకు వెళ్లి.. వేరే ఊళ్లో తాగి తినాల్సిందే తప్పా…. పొలిమేర దాటి గ్రామంలోకి మందు, ముక్క ఉండడానికి వీల్లేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు.

అడిగుప్ప గ్రామంలో చికెన్ తినరు కాబట్టి… అందుకే ఆ గ్రామంలో కోడి కూడా కూయదు అంటారు. ఎవరికైనా నాలుక పీకి.. నోరు లబలబలాడితే, పక్క ఊరుకి వెళ్లి తాగి, తిని, అరిగిన తర్వాత మాత్రమే పొలిమేర దాటి ఊళ్లోకి రావాలి అన్న కట్టుబాటు ఇప్పటికీ కొనసాగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆఖరికి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం కోసం ఇచ్చే కోడిగుడ్డు కూడా అడిగుప్ప గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిషేధం. కోడిగుడ్డుకు బదులు అరటిపండు లేదా ఏదైనా స్వీట్ విద్యార్థులకు ఇస్తున్నారు. వింత ఆచారాన్ని పూర్వీకుల కట్టుబాట్లు, సాంప్రదాయాలను పాటిస్తున్న అడిగుప్ప గ్రామస్తులు గురించి తెలుసుకున్న వాళ్ళు ఔరా అంటున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..
అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..
హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..
హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..
కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..
కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..
అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..
అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..
కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..
కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..
బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!
బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!
ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు
ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు
ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?
ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?
మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..
మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..
డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!
డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!