Andhra Pradesh: బైక్‌ ఇంజన్‌లో దూరిన పాము .. ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఓ భారీ పాము బైక్‌లోకి దూరింది. అయితే వాహనదారుడి అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది.

Andhra Pradesh: బైక్‌ ఇంజన్‌లో దూరిన పాము .. ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..?
Snake In Bike
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 08, 2024 | 9:39 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఓ భారీ పాము బైక్‌లోకి దూరింది. అయితే వాహనదారుడి అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది. రెప్పపాటులో తప్పించుకుని స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది.

గుంతకల్లు కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉంచిన బైక్‌లో పాము కనిపించడంతో కలకలం రేగింది. బైక్‌లో పామును తొలగించే ప్రయత్నం చేశారు. బైక్ ఇంజన్ లో ఇరుక్కుపోయిన పాము బయటకు రాలేక నానా అవస్థలు పడింది. చివరకు స్నేక్ క్యాచర్ వచ్చి బైక్ లో దూరిన పామును బయటకు తీశారు. దాదాపు గంట పాటు శ్రమించిన తర్వాత పామును బయటకు తీయగలిగారు. దీంతో అక్కడున్న అడ్వకేట్లు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..