Andhra Pradesh: అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకొన్న కారు.. క్షణాల్లో బూడిదైంది..

తెల్లవారు అయిదు గంటలు.. అంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడే జనాలు రోడ్ల మీదకు వస్తున్నారు. రైల్వే స్టేషన్, ఆర్టీసి కాంప్లెక్స్ సమీపం కావడంతో ఎత్తు బ్రిడ్జ్ వద్ద మరి కొంచెం రద్దీగా కనిపిస్తుంది. అదే సమయంలో ఓ షిఫ్ట్ డిజైర్ కారు వేగంగా దూసుకువస్తుంది. అలా ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చిన్నపాటిగా మొదలైన మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన కారు డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ప్రక్కనే మూడు పెట్రోల్ బంక్స్ ఉండటంతో ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Andhra Pradesh: అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకొన్న కారు.. క్షణాల్లో బూడిదైంది..
Car
Follow us

| Edited By: Aravind B

Updated on: Oct 03, 2023 | 9:52 PM

తెల్లవారు అయిదు గంటలు.. అంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడే జనాలు రోడ్ల మీదకు వస్తున్నారు. రైల్వే స్టేషన్, ఆర్టీసి కాంప్లెక్స్ సమీపం కావడంతో ఎత్తు బ్రిడ్జ్ వద్ద మరి కొంచెం రద్దీగా కనిపిస్తుంది. అదే సమయంలో ఓ షిఫ్ట్ డిజైర్ కారు వేగంగా దూసుకువస్తుంది. అలా ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చిన్నపాటిగా మొదలైన మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన కారు డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ప్రక్కనే మూడు పెట్రోల్ బంక్స్ ఉండటంతో ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగప్రవేశం చేసి మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదం జరిగిన క్షణాల్లో కారు డ్రైవర్ మాత్రం పరారయ్యాడు. కారు ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ నుండి వస్తున్నారు? అని అడగటానికి కూడా ఎవరూ కనిపించలేదు.

ప్రమాద సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్షులు మాత్రం డ్రైవర్ కంగారుగా పారిపోయాడు అని చెప్పారు. దీంతో పోలీసులకు కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. అసలు కారు ఎవరిది? కారు ఎక్కడ నుండి వచ్చింది? కారు డ్రైవర్ ఎందుకు పరారయ్యాడు? కారు దగ్ధం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కావాలనే తగలబెట్టారా?అసలు కారులో ఏముంది? ఏమైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి కారును తగలబెట్టారా? అనే అనేక అనుమానాలు పోలీసులకు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో ముందుగా అసలు కారు ఎక్కడ నుండి బయలుదేరిందో అని సీసీటీవి పుటేజ్ లో చూసే ప్రయత్నం చేశారు. కారు మొదటగా విజయనగరం జిల్లా దాసన్న పేట నుండి బయలుదేరినట్లు గుర్తించారు. దాసన్న పేట నుండి బయలదేరిన కారు ఉడా కాలనీకి వెళ్లి అక్కడ నుండి తిరిగి విశాఖ వైపు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఎత్తు బ్రిడ్జి పైకి వస్తుండగా ఘటన జరిగింది.

అయితే కారు పూర్తిగా దగ్ధం అవ్వడంతో కారు మోడల్ తప్పా కారుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో కారు యొక్క ఆధారాలు సేకరించడం కూడా పోలీసులకు కష్టంగానే మారింది. అయితే అసలు కారులో ఎంత మంది వచ్చారు? ఎక్కడ నుండి వచ్చారు? ఎందుకు పారిపోయారు? కారు అగ్ని ప్రమాదానికి గురైన తరువాత మళ్లీ ఎందుకు కనిపించలేదు అనేది మాత్రం పోలీసులకు అంతుపట్టడం లేదు. మొదట అగ్ని ప్రమాదంగా భావించిన పోలీసులు తరువాత జరిగిన ప్రమాదాన్ని అనుమానాస్పదంగా భావిస్తున్నారు. కారు దగ్ధానికి సంభందించిన మిస్టరీ తెలియకపోవడంతో పోలీసులు సవాలుగా తీసుకొని ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీకి దూసుకొస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌.! ఏడో ప్రమాద హెచ్చరిక.
ఏపీకి దూసుకొస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌.! ఏడో ప్రమాద హెచ్చరిక.
నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.?
నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.?
జీఎస్టీ వసూళ్లలో రికార్డ్.! రూ.1.66 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు..
జీఎస్టీ వసూళ్లలో రికార్డ్.! రూ.1.66 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు..
ఖాన్‌ యూనిస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు 24గంటల్లో 700మంది మృతి.
ఖాన్‌ యూనిస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు 24గంటల్లో 700మంది మృతి.
తెలంగాణలో మిచౌంగ్ తుపాన్ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాలు..
తెలంగాణలో మిచౌంగ్ తుపాన్ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాలు..
21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్.
21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్.
మిగ్‌ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం!
మిగ్‌ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం!
దక్షిణకోస్తాకు ముప్పు! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు
దక్షిణకోస్తాకు ముప్పు! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు
చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది! వీడియో
చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది! వీడియో
మరో యోగి రెడీ అవుతున్నారా.? రాజస్థాన్‌ లో బాబాబాలక్‌నాథ్‌.
మరో యోగి రెడీ అవుతున్నారా.? రాజస్థాన్‌ లో బాబాబాలక్‌నాథ్‌.