AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తాను మరణిస్తూ మరికొందరి జీవితాల్లో వెలుగులు.. గ్రీన్‌ ఛానల్‌ ద్వారా గుండె తరలింపు..

Andhra Pradesh: రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. అయితే తాను చనిపోతున్న సమయంలోనూ మరికొందరికి ప్రాణ దానం చేశాడు. వివరాల్లోకి వెళితే..

Andhra Pradesh: తాను మరణిస్తూ మరికొందరి జీవితాల్లో వెలుగులు.. గ్రీన్‌ ఛానల్‌ ద్వారా గుండె తరలింపు..
Narender Vaitla
|

Updated on: Apr 16, 2022 | 9:27 PM

Share

Andhra Pradesh: రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. అయితే తాను చనిపోతున్న సమయంలోనూ మరికొందరికి ప్రాణ దానం చేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పెద పలకలూరు, జన్మభూమి నగర్‌కు చెందిన బొక్కిసం రాజా అనే వ్యక్తి ఓ కాంట్రాక్టర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసే వాడు. ఈ క్రమంలోనే ఈ నెల 13 వ తేదీ రాత్రి 9 గంటలకు పెదనందిపాడు వెళుతూ చిలకలూరిపేట హైవేలో ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్ లేకపోవటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రాజాను చికిత్స కోసం రమేష్ హాస్పిటల్స్ కు తరలించారు.

తలకు తీవ్ర గాయాలు కావడంతో రోగికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. రాజాకు భార్య, 7వ తరగతి,10వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. బ్రెయిన్ డెడ్‌కు గురైన రాజా కుటుంబ సభ్యులు అవయవ దానానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంతో. జీవన్ దాన్ ద్వారా రమేష్ హాస్పిటల్స్‌కు లివర్, కిడ్నీ అవయవాలను ట్రాన్స్ ప్లాంట్‌కు అనుమతి వచ్చింది. గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. అక్కడ నుంచి చెన్నై తీసుకెళ్లనున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్లే ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ పై ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని కుటుంబ సభ్యులు సూచించారు.

టి. నాగరాజు టీవీ 9 తెలుగు, గుంటూరు.

Also Read: Belur Temple: మత సామరస్యానికి ప్రతీక ఈ గొప్ప ఆచారం.. వేయేళ్ల చరిత్ర గల ఆలయంలో..

Viral Video: ఛీ.. ఛీ.. గ్రౌండ్‌లో ఇదేం పాడి పని.. అందరూ చూస్తుండుగా ఇలా ఏంట్రా మీరు..

Divi Vadthya: ‘దివి’ నుండి దిగివచ్చిన దేవకన్యలా.. అమ్మడి ఫొటోస్ అదుర్స్..