AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: ఏడ్చుకుంటూ పరుగున పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన చిన్నారి.. ఏంటని ఆరా తీయగా

ఓ బాలిక ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది ఆమెను ఓదార్చి.. అసలేం జరిగిందని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె చెప్పిన మాటలు విని.. వీరంతా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి.. ఆపై ఇలా..

Kadapa: ఏడ్చుకుంటూ పరుగున పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన చిన్నారి.. ఏంటని ఆరా తీయగా
Andhra Pradesh
Sudhir Chappidi
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 17, 2025 | 1:16 PM

Share

పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే అందరికీ అదొక రకమైన భయం. ఎందుకో తెలియదు గానీ ఆ ప్రదేశానికి వెళ్లాలంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు. సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా మధ్యవర్తులతోనే పరిష్కరించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడో బుడ్డది ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఆ బాలిక ధైర్యసాహసాలకు పోలీసులు మెచ్చుకుని స్వయంగా వారే ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ బాలిక సమస్యను పరిష్కరించారంట.

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు పోలీస్ స్టేషన్‌కు ఓ చిన్నారి ఏడుస్తూ వెళ్ళింది. అది గమనించిన అక్కడి పోలీసులు ఆ చిన్నారిని చేరదీసి ఏమి సమస్య అని సాదరంగా అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడకు ఏడ్చుకుంటూ వెళ్ళిన చిన్నారి పోలీసులకు జరిగిన విషయం అంతా చెప్పింది. తమ పక్కింటివారు తన తల్లిదండ్రుల వద్ద పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నారని, వాటిని అడిగితే ఇవ్వకుండా గొడవపడుతూ.. ఇబ్బంది పెట్టడంతో బాధ వేసి ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చానని లోహిత అనే ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని పోలీసులకు ధైర్యంగా తన సమస్యను చెప్పింది.

ఇది విన్న స్టేషన్‌లోని హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది.. ఆమెను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి లోహిత సమస్యను పరిష్కరించారంట. దీంతో లోహిత చేసిన పనికి.. ఆమె ధైర్యానికి కలసపాడు పోలీసులే కాదు చుట్టుపక్కల వారందరూ కూడా ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. లోహిత కలసపాడులోని సెయింట్ ఆంటోనీ స్కూల్‌లో 5వ తరగతి చదువుతుంది. ఐదో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తన తల్లిదండ్రులకు జరిగిన అన్యాయంపై వారికి ఫిర్యాదు చేసి.. వారి సమస్యను పరిష్కరించడంపై స్థానికులంతా ఆమెను మెచ్చుకుంటున్నారు.

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..