Andhra: 150 ఏళ్లుగా పూజలు.. అకస్మాత్తుగా నేలకొరిగిన వటవృక్షం.. కన్నీళ్లు పెట్టుకున్న జనం.. ఎక్కడంటే..
ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలోని భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భారీ మర్రి చెట్టు నేలకొరిగింది. చెట్టు కూలిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానిక ప్రజలు తెలిపారు. కూలిన మర్రి చెట్టుకు దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉంటుందన్నారు.

ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలోని భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భారీ మర్రి చెట్టు నేలకొరిగింది. చెట్టు కూలిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానిక ప్రజలు తెలిపారు. కూలిన మర్రి చెట్టుకు దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉంటుందని, ఇన్నేళ్ళుగా పూజలందుకుంటూ, నీడనిచ్చే చెట్టు కూలిపోవడంతో బాధగా ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అక్కడకు చేరుకుని.. కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల మొంథా తుఫాను కారణంగా ఈదురు గాలులకు చెట్టు పటుత్వం సన్నగిల్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశంలో హిందూ సంప్రదాయాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రకృతిని పూజించడం మన సంస్కృతిలో భాగం. ఆధ్యాత్మికంగా మన దేశంలో చెట్లను, జంతువులను, నదులను పూజిస్తారు. ముఖ్యంగా ప్రకృతిలో ప్రధాన పాత్ర వహించే చెట్లను భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అందులో మర్రిచెట్టుకు ఉన్న ప్రాధాన్యత వేరు. మర్రిచెట్టును వటవృక్షం అని కూడా పిలుస్తారు.
మర్రిచెట్టు వరుణుడి ప్రీతిపాత్రమైనదని, ఈ చెట్టు ఉంటే వర్షాలు సకాలంలో పడతాయని విశ్వసిస్తారు. మర్రిచెట్టుకు మరో విశిష్టత ఉంది. ఈచెట్టు నేలపైభాగంతో పాటు కింద భూమిలో కూడా పెరుగుతుంది. దీని ఊడలు కిందకు వేలాడుతూ భూమిలోకి చొచ్చుకువెళతాయి. పురాణకాలంలో జలప్రళయం సంభవించినప్పుడు శ్రీమహావిష్ణువు బాలుడిగా వటపత్రంపై అంటే మర్రి ఆకుపై మార్కండేయ మహామునికి దర్శనం ఇచ్చాడని పురాణాల్లో ఉందట.
ఈ చెట్టు దేవతల నివాస స్థానం అని కూడా వేద పండితులు చెబుతుంటారు.. అలాంటి విశిష్టత ఉన్న 150 ఏళ్ళ నాటి మర్రిచెట్టు ప్రకాశంజిల్లా కంభంలో ఇటీవల మొంథా తుఫాను గాలివాన ధాటికి నేలకూలిపోయింది. నిత్యం పూజలందుకుంటున్న వటవృక్షం కూలిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
