Andhra Pradesh: పల్నాడు జిల్లాలో బాలుడి మిస్సింగ్‌ కలకలం.. ఇంటి బయట ఆడుకుంటుండగా..

|

Jan 22, 2023 | 6:35 AM

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో బాలుడి మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. ఇంటిబయట ఆడుకుంటున్న పిల్లాడు కనిపించకుండాపోవడంతో పేరెంట్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో బాలుడి మిస్సింగ్‌ కలకలం.. ఇంటి బయట ఆడుకుంటుండగా..
Boy Missing
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో బాలుడి మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. ఇంటిబయట ఆడుకుంటున్న పిల్లాడు కనిపించకుండాపోవడంతో పేరెంట్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నరసరావుపేట రూరల్ పరిధిలోని స్థానికబ్యాంక్‌కాలనీకి చెందిన బండి వాసు, సాయిలక్ష్మీ దంపతులకు కూతురు మోక్ష(4), కుమారుడు భాను ప్రకాష్ (1 సంవత్సరం) ఉన్నారు. అయితే, కుమారుడు భానుప్రకాశ్‌ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో కనిపించకుండాపోయాడు. ఇంటి పరిసర ప్రాంతాల్లో అంతా వెతికినా ఫలితం లేకపోవడంతో బాలుడి తండ్రి బండివాసు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందిన వెంటనే డిఎస్పీ విజయ్ భాస్కరరావు తన పోలీస్ బృందాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి అదృశ్యం అయిన ప్రదేశం, ఘటన జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆ ఏరియాలో సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం పోలీస్‌ టీమ్‌లు సెర్చింగ్‌ మొదలెట్టాయి.

బాలుడి తండ్రి గత రెండు రోజుల నుండి కాలనీలో రోడ్డుపై పీకలు, వెంట్రుకలు అమ్మేవారు తిరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తపరిచారు. తన కుమారుని ఆచూకీ తెలిసినవారు నరసరావుపేట పోలీసులను సమాచారం అందించాలని బాలుడి తండ్రి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..