Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్.. కూల్చడానికి వెనుకాడిన పెంటగాన్ విమానాలు.. ఎందుకంటే?

సరిహద్దు దేశాలపై కవ్వింపులకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పుడు అమెరికాపై ఫోకస్ పెట్టింది. ఓ భారీ ఎయిర్ బెలూన్‌తో అమెరికాలోని రక్షణ వ్యవస్థను ఫోటోలు తీస్తూ దొరికిపోయింది. ఈ ఘటనతో ఆ దేశ ప్రెసిడెంట్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ బెలూన్‌ను కూల్చివేయాలని ఆదేశించారు. అయితే..

USA: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్.. కూల్చడానికి వెనుకాడిన పెంటగాన్ విమానాలు.. ఎందుకంటే?
Chinese Spy Balloon
Follow us
Sanjay Kasula

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 03, 2023 | 2:35 PM

చైనా కన్ను ఇప్పుడు అగ్రదేశం అమెరికాపై పడింది. మరోసారి అమెరికాలో గూఢచర్యానికి సాహసించింది. దీనికి పెద్ద సాక్ష్యం దొరికిపోయింది. అమెరికా ఆకాశంలో చైనీస్ స్పై బెలూన్ ఎగురుతున్నట్లు గుర్తించింది. ఆ తర్వాత అమెరికా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వెంటనే చైనా దౌత్యవేత్తకు సమన్లు ​​జారీ చేసింది. అనుమానిత చైనీస్ గూఢచారి బెలూన్ చాలా రోజులుగా యునైటెడ్ స్టేట్స్ మీదుగా ఎగురుతుండటాన్ని గుర్తించినట్లుగా పెంటగాన్ తెలిపింది. ఇందులో సంబంధించిన ఆధారాలను సేకరించినట్లుగా వెల్లడిచింది. ఈ చైనీస్ గూఢచారి బెలూన్ సైజు మూడు బస్సులతో సమానమని తెలుస్తోంది. తమ ఆంతర్గత విషయాలకు భద్రతకు ప్రమాదం కలిగిస్తాయి కాబట్టి దానిని కాల్చివేయాలని అధ్యక్షుడు జో బిడెన్‌కు సూచించారు అమెరికా సీనియర్ అధికారులు.

అత్యంత సున్నితమైన అణ్వాయుధ సైట్‌లను పర్యవేక్షిస్తున్నట్లు అనుమానిస్తున్న చైనా గూఢచారి బెలూన్‌ను యునైటెడ్ స్టేట్స్‌పై ఎగురుతున్నట్లు పెంటగాన్ పేర్కొంది. సీనియర్ US రక్షణ అధికారి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ, బెలూన్‌ను కాల్చివేయాలని ఉన్నత సైనిక అధికారులు భావించారని.. అయితే అది భూమిపై ఉన్న చాలా మందిని ప్రమాదంలో పడేస్తుందనే భయంతో అలా చేయలేదని తెలిపారు.

ఈ బెలూన్ అమెరికాలోని వాయువ్య ప్రాంతంపై ఎగురుతుందని.. అక్కడ సున్నితమైన ఎయిర్‌బేస్‌లు, వ్యూహాత్మక క్షిపణులు ఉన్నాయి. చైనీస్ గూఢచారి బెలూన్ నిఘా కోసం ఉద్దేశించబడిందని.. అనేక సున్నితమైన ప్రదేశాలపై ఎగురుతున్నదని అమెరికా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం, ఈ చైనీస్ బెలూన్ ఉత్తర మోంటానా ఆకాశంలో ఎగురుతోంది. దాని వెనుక అమెరికన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా  ఏర్పాటు చేశారు.

అత్యంత సున్నితమైన అణ్వాయుధాలు ఉన్న ప్రాంతాలనే ఈ చైనా గూఢచారి బెలూన్‌ల ఫోటోలు తీస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. ఆ తర్వాత, US స్టేట్ డిపార్ట్‌మెంట్ వాషింగ్టన్‌లోని చైనాకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దౌత్యవేత్తను పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించారు అమెరికా అధికారులు. ఇదిలావుండగా, చైనా బెలూన్ ప్రస్తుతం వాణిజ్య వాయు ట్రాఫిక్ కంటే చాలా ఎత్తులో ప్రయాణిస్తోందని, దీంతో ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది.

అమెరికాలో గూఢచర్యం చేస్తున్నట్టు చైనాపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదని.. ఇంతకు ముందు కూడా చైనా అమెరికాలో గూఢచర్యం చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం